Home > సినిమా > Raviteja Eagle Movie : మారింది తేదీ మాత్రమే.. మాసోడి మార్క్ కాదు..

Raviteja Eagle Movie : మారింది తేదీ మాత్రమే.. మాసోడి మార్క్ కాదు..

Raviteja Eagle Movie : మారింది తేదీ మాత్రమే.. మాసోడి మార్క్ కాదు..
X

మాస్ మహరాజ్ రవితేజ ఈగిల్ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. ఈ సంక్రాంతికి ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనంత భారీ పోటీ వచ్చింది. పైగా అందరూ స్టార్ హీరోలే. ఒక స్మాల్ హీరోను తప్పిద్దాం అనుకుంటే అతను మొండిగా ఉన్నాడు. ప్యాన్ ఇండియన్ సినిమాగా రిలీజ్ అవుతుంది కాబట్టి తప్పుకోవడం కుదరదు అన్నాడు. దీంతో మొండోడినే ఒప్పించి పోటీలో రద్దీ తగ్గించారు. యస్.. ఈగిల్ గా ఆ మొండి బోతుబరి చేసిన విధ్వంసం చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సి వస్తోంది. 12న గుంటూరు కారం, హను మాన్, తమిళ్ మూవీ అయలాన్ వస్తున్నాయి. 13న సైంధవ్, 14న నా సామిరంగా విడుదలవుతున్నాయి. అయితే 13నే ఈగిల్ రావాల్సి ఉంది. ఇండస్ట్రీ పెద్దలంతా కూర్చుని మాట్లాడి రవితేజతో పాటు ఈ చిత్ర నిర్మాతలను ఒప్పించి మరో కొత్త డేట్ కు వెళ్లేలా చేశారు.ఆ డేట్ లో రవితేజకు పోటీగా మరే సినిమా రాకుండా ఉండేలా.. ఎక్కువ మొత్తం థియేటర్స్ అన్నీ ఈగిల్ కే వెళ్లేలా చేస్తామని హామీ కూడా ఇవ్వడంతో రవితేజ నుంచి సానుకూలమైన స్పందన వచ్చింది. దీంతో నిర్మాతలు ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు. నిజానికి ఈ నెల 26న మాస్ మహరాజా రవితేజ బర్త్ డే ఉంది. అదే రోజు ఫ్రైడే కూడా వచ్చింది. పైగా పబ్లిక్ హాలిడే. దీంతో 26న విడుదలవుతుందేమో అని భావించారు. బట్ వీళ్లే ఫిబ్రవరి 9ని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ రోజు ఆల్రెడీ డేట్ అనౌన్స్ చేసిన డిజే టిల్లు స్క్వేర్ ను వాయిదా వేసేందుకు నిర్మాత నాగవంశీ ఓకే చెప్పాడు. యాత్ర2 కూడా ఫిబ్రవరి 9 డేట్ ను అనౌన్స్ చేసింది. ఈ యాత్ర2 ను కూడా వాయిదా వేయించే ప్రయత్నం చేస్తాం అని చెప్పాడు దిల్ రాజు. సో.. ఈగిల్ కు మాగ్జిమం సోలో రిలీజ్ దక్కే అవకాశాలున్నాయి.





అయితే ఇలాంటి సందర్భాల్లో అభిమానుల నుంచి వ్యతిరేకత వస్తుంది. తమ హీరోను కావాలనే తొక్కేస్తున్నారు అన్న భావన కలుగుతుంది. అది ఇతర హీరోల సినిమాలపై నెగెటివ్ ప్రచారం చేసేలా ప్రోవోక్ చేస్తుంది. అందుకే ఈగిల్ టీమ్ నుంచి ఓ అఫీషియల్ లెటర్ రిలీజ్ చేశారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్స్. ఈ లెటర్ లో ఏముందంటే..

‘‘ బాగు కోసం బరిలో రద్దీ తగ్గించాం’’





‘ మొండోడి మనసు పుట్టతేనే. తన నిర్మాత, పరిశ్రమ బాగు కోసం బరిని సంక్రాంతి నుంచి ఫిబ్రవరికి తీసుకొచ్చాడు. అందరూ చూడాల్సిన జనరంజక చిత్రం ప్రదర్శించడానికి అంతే మొత్తంలో థియేటర్స్ కావాల్సి ఉంటుంది. దర్శకుడు మొదలుకుని సృజనాత్మక సిబ్బంది పనిని ప్రేక్షకులకు చూసి మెచ్చుకోవడానికి ఒక ఇరుకులేని వేదిక, సమయం కావాలి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని బరిలో రద్దీని తగ్గించే నిర్ణయం తీసుకున్నారు.

మారింది తేదీ మాత్రమే.. మాసోడి మార్క్ కాదు.. ’

అంటూ రాసుకొచ్చిన ఈ ఉత్తరంతో అటు రవితేజ అభిమానులను కూడా చల్లబరిచే ప్రయత్నం జరిగింది అనుకోవచ్చు. మరి ఈ సోలో డేట్ తో మాస్ మహరాజా కొత్త రికార్డులు ఏమైనా క్రియేట్ చేస్తాడేమో చూడాలి.


Updated : 5 Jan 2024 6:23 AM GMT
Tags:    
Next Story
Share it
Top