Tiger Nageswararao Movie : టైగర్ నాగేశ్వరరావుకు కత్తెర.. ఇకపై రన్ టైమ్ ఎంతంటే..
X
ఆలోచింపజేసే కథ, కథనం బావున్నా నిడివి మరీ కొండవీటి చేంతాడంతగా ఉండడంతో రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ను ప్రేక్షకులు పట్టించుకోవడం లేదని నిర్మాతలు ప్లాన్ మార్చారు. సినిమా నిడివికి కోత పెట్టారు. 3 గంటల 2 నిమిషాలు సాగే మూవీ రన్ టైమ్ ను దాదాపు అరగంట తగ్గించి 2 గంటల 37 నిమిషాలకు సెట్ చేశారు. అంతకు మించి కత్తిరిస్తే కథ చెడిపోతుందని, తప్పనిసరై ఆ మాత్రం కత్తెరవేశారు.
1970ల నాటి స్టూవర్టుపురం దొంగ నాగేశ్వరరావు జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీసిన ఈ సినిమా శుక్రవారం విడుదల కాగా సానుకూల స్పందనే వస్తోంది. అయితే నిడివి మూడు గంటలు దాటడడంతో యువప్రేక్షులకు భరించలేకపోతున్నారు. ఈ టాక్‌తో వసూళ్లు పడిపోయాయి. తొలి రెండు రోజులకు కలిపి రూ. 12 కోట్ల కలెక్షన్ వచ్చింది. దసరా, వీకెండ్ సీజన్లలో బోర్ కొట్టించకుండా చూపడానికి కత్తెర వేశారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహించగా అనుపమ్ ఖేర్, నుపుర్ సనన్, రేణు దేశాయ్, జిషుసేన్ గుప్తా తదితరులు నటించారు.