Home > సినిమా > క్రాక్ డైరెక్టర్ కు షాక్.. అనిల్ కు హామీ ఇచ్చిన రవితేజ

క్రాక్ డైరెక్టర్ కు షాక్.. అనిల్ కు హామీ ఇచ్చిన రవితేజ

క్రాక్ డైరెక్టర్ కు షాక్.. అనిల్ కు హామీ ఇచ్చిన రవితేజ
X

రాజా రాజా ది గ్రేటురా అంటూ బ్లైండ్ మేన్ తో అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ పంచాడు దర్శకుడు అనిల్ రావిపూడి. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ లాజిక్స్ ను దాటి మరీ కలెక్షన్స్ సాధించింది. రవితేజకు టైలర్ మేడ్ లాంటి రోల్. కమెడియన్ శ్రీనివాస రెడ్డి కంటే ఎక్కువ కామెడీ పంచాడు రవితేజ. ఈ కాంబినేషన్ ఇప్పుడు మళ్లీ రిపీట్ కాబోతోంది. యస్.. రవితేజ - అనిల్ రావిపూడి కాంబోలో మరో సినిమా రెడీ అవుతోంది. నిజానికి ఈ మూవీ క్రాక్ మూవీ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఉండాలి. కానీ ప్రొడక్షన్ హౌస్ తో వచ్చిన విభేదాల కారణంగా ఆ ప్రాజెక్ట్ ఆగింది. ఆ డేట్స్ లో రవితేజ అనిల్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మూవీని కూడా దిల్ రాజే నిర్మించబోతున్నాడు.

ధమాకా తర్వాత రవితేజ దాదాపు అన్నీ సీరియస్ రోల్స్ చేస్తుున్నాడు. రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. ఈ సంక్రాంతికి ఈగల్ గా రాబోతున్నాడు. ఇదీ సీరియస్ గానే కనిపిస్తోంది. సో.. ఈ టైమ్ లో అనిల్ రావిపూడితో సినిమా అంటే మరోసారి వీరి కాంబోపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగా అదిరిపోయే ఎంటర్టైనర్ ఎక్స్ పెక్స్ చేయొచ్చు. కాకపోతే ఈ సారి మరీ రాజా ది గ్రేట్ లా సిల్లీ స్టోరీతో కాకుండా కాస్త మంచి కంటెంట్ తో వస్తే ఇంకా బావుంటుంది.

Updated : 5 Dec 2023 3:38 PM IST
Tags:    
Next Story
Share it
Top