హోంబలే పెద్ద స్కెచ్.. సలార్తో RCB లింక్
X
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్స్ లో వస్తున్న సినిమా సలార్. ఇప్పటికే చాలాసార్లు ఈ సినిమా వాయిదా పడగా.. డిసెంబర్ 22న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సలార్ కూడా రెండు పార్ట్స్ గా రాబోతుంది. కొన్ని రోజుల క్రితం రిలీజ్ అయిన టీజర్ తో సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.
కాగా ట్రైలర్ డిసెంబర్ 1న రిలీజ్ చేస్తున్నట్లు చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ వార్తతో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు, సినిమా లవర్స్ అంతా ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా రిలీజ్ వచ్చే నెలలో ఉన్నా ప్రమోషన్స్ ఇంకా మొదలుపెట్టకపోవడంతో అభిమానుల్లో ఆందోళన మొదలయింది. మళ్లీ రిలీజ్ వాయిదా వేస్తారా అని చర్చలు మొదలయ్యాయి. దాంతో తేరుకున్ సలార్ బృందం.. తాజాగా ప్రమోషన్స్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టీంని దింపింది.
సలార్ నిర్మాతలైన హోంబలె ఫిలిమ్స్ బెంగుళూరు ఐపీఎల్ టీంతో తమ సినిమాలకు ప్రమోషన్స్ చేయిస్తుంది. దీనికి సంబంధించిన పోస్టర్ ను ఆర్సీబీ అఫీషియల్ సైట్ లో పోస్ట్ చేసింది. గతంలో కేజీఎఫ్ సినిమాకి కూడా ఆర్సీబీ టీం ప్రమోషన్స్ చేసింది. తాజాగా సలార్ ట్రైలర్ ను కూడా ఆర్సీబీ ప్రమోట్ చేస్తుంది. ఈ పోస్ట్ లో కోహ్లీ వెనక్కి తిరిగి ఉండగా, సిరాజ్, మ్యాక్స్ వెల్ ఉండి సలార్ ట్రైలర్ డిసెంబర్ 1న రాబోతుందని ప్రమోట్ చేస్తున్నారు. మున్ముందు కూడా ఆర్సీబీ టీం సలార్ కి ప్రమోషన్స్ చేస్తుందని తెలుస్తుంది. దీంతో విరాట్, ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.