Home > సినిమా > Sonusood : డీప్ ఫేక్ బారిన రియల్ హీరో సోనూసూద్

Sonusood : డీప్ ఫేక్ బారిన రియల్ హీరో సోనూసూద్

Sonusood : డీప్ ఫేక్ బారిన రియల్ హీరో సోనూసూద్
X

కరోన కష్ట సమయాల్లో ఎంతో మందికి అండగా నిలిచిన రియల్ హీరో సోనూసూద్ కూడా డీప్ ఫేక్ బారిన పడ్డారు. దీనిపై ఆయన స్పందిస్తూ..కొందరు నా డీప్ ఫేక్ వీడియోను క్రియేట్ చేసి అభిమానులతో చాటింగ్, వీడియో కాల్ చేస్తూ డబ్బులు వసూలు చేయాలని చూస్తున్నారు. చాలా మంది అమాయకులు ఆ వీడియోలో ఉన్నది నేనే అనుకొని సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారని సోనూసూద్ అన్నారు. వీటిని నమ్మకండి జాగ్రత్తగా ఉండండి అంటు ఆయన ట్వీట్టర్ తెలిపారు.

టెక్నాలజీ విపరీతంగా అడ్వాన్స్ అవ్వడం వల్ల మామూలు ప్రేక్షకుల దగ్గర నుండి సినీ సెలబ్రిటీల వరకు ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. తాజాగా డీప్‌ ఫేక్ వీడియో అనే ఒక టెక్నాలజీ సెలబ్రిటీలను వణికిస్తోంది. ఇప్పటికీ పలువురు హీరోయిన్లు.. ఈ డీప్ ఫేక్ వల్ల ఇబ్బందులు ఎదుర్కున్నారు. మొదట రష్మిక డీప్‌ ఫేక్ వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అలియా భట్‌, కాజోల్‌, కత్రినా కైఫ్‌, ప్రియాంక చోప్రాల డీప్ ఫేక్‌ వీడియోలు ఆందోళన కలిగించాయి. తాజాగా మాజీ క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ కూడా దీని బారిన పడ్డారు. వీటిపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వీటిని నివారించేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.




Updated : 20 Jan 2024 12:11 PM IST
Tags:    
Next Story
Share it
Top