స్మగ్లర్ పాత్రకి అవార్డా..? విమర్శలకు ఇదే సమాధానం..
X
సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. తెలుగు నుంచి ‘పుష్ప’, ‘ఆర్ఆర్‌ఆర్’ సినిమాలు అత్యధిక అవార్డులను సొంతం చేసుకున్నాయి. ఉత్తమ నటుడు, కొరియోగ్రాఫర్, యాక్షన్ కొరియోగ్రఫీ , గేయ రచయిత, నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు కేటగిరీలో తెలుగు వారు అవార్డులు దక్కించుకున్నారు. . 69 ఏళ్లలో ఏ తెలుగు హీరోకు దక్కని అరుదైన గౌరవం బన్నీ దక్కింది. పుష్పలో నటనకు గానూ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అల్లు అర్జున్ సొంతం చేసుకున్నారు.
అల్లు అర్జున్ ను 69వ నేషనల్ అవార్డ్ వరించడంతో టాలీవుడ్ సంబరాలు చేసుకుంటోంది. బన్నీ ఇంట ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. పుష్ప సినిమా నిర్మాతలు, డైరెక్టర్ సుకుమార్.. అల్లు అర్జున్ ను కలిసి ఆయనకు స్వయంగా విషెస్ చెప్పారు. ఇక తనకు పుష్ప లాంటి సినిమాను అందించిన సుకుమార్ ను కౌగిలించుకుని బన్నీ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఇదిలా ఉంటే పుష్పలో బన్నీ ఎర్రచందనం స్మగ్లర్ పాత్ర పోషించాడు. అలాంటి పాత్రకు జాతీయ అవార్డు ఇవ్వడం ఏంటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంత కన్నా మంచి పాత్ర .. మంచి నటన కనబడలేదా అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి పుష్ప లో తన పాత్రలో ఒదిగిపోయాడు. నటించాడు అనడం కన్నా ఆ పాత్రలో జీవించాడు అని చెప్పారు. తనదైన మ్యానరిజమ్స్ .. పాత్రకు తగ్గ నటనతో ఆ పాత్రని తాను మాత్రమే చేయగలన్న రేంజ్లో స్థాయిలో నటించాడు. అందుకే బన్నీకి ఉత్తమ నటుడు అవార్డు దక్కిందని అభిమానులు అంటున్నారు.
ఇదిలా ఉంటే 2021 సంవత్సరానికిగానూ ఉత్తమ నటి అవార్డు ఆలియా భట్ , కృతిసనన్ లకు దక్కాయి. 31 విభాగాల్లో ఫీచర్ ఫిల్స్మ్‌కు, అలాగే 24 విభాగాల్లో నాన్ ఫీచర్ ఫిల్మ్స్‌కు, 3 విభాగాల్లో రచనా విభాగానికి అవార్డులు ప్రకటించారు. మొత్తం 281 ఫీచర్ ఫిల్మ్‌లు ఈసారి జాతీయ అవార్డుల కోసం వచ్చినట్లు జ్యూరీప్రకటించింది. ఉత్తమ చిత్ర విమర్శకుడు కేటగిరిలో పురుషోత్తమచార్యులుకు అవార్డు దక్కింది. 2021 సంవత్సరానికి గానూ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘ఉప్పెన’ ఎంపికైంది. ఇక ఉత్తమ హిందీ చిత్రంగా సర్దార్ ఉద్ధమ్, ఉత్తమ గుజరాతీ చిత్రం ‘ఛల్లో షో, ఉత్తమ కన్నడ చిత్రంగా ‘777 చార్లీ’, ఉత్తమ మలయాళీ చిత్రంగా ‘హోమ్’ ఎంపికయ్యాయి. హిందీ నుంచి గంగూబాయి కాతియావాడీని జ్యూరీ సెలెక్ట్ చేసింది.