Bigg Boss 7 :లాస్ట్ మినిట్‌లో బిగ్ బాస్ ఆఫర్ రిజెక్ట్ చేసిన గుండమ్మ
X
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మరికొన్ని గంటల్లో షురూ కానుంది. ఉల్టాపుల్టా థీమ్‌తో ప్రేక్షకుల ముందుకురానున్న బిగ్‌బాస్ షో ఈసారి మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అందుకు తగ్గట్లుగానే ఈ సీజన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సీజన్ 7లో బిగ్ బాస్ హౌస్ లోకి బుల్లితెర నటి గుండమ్మ కథ సీరియల్ ఫేం పూజామూర్తి అడుగుపెట్టడం పక్కా అని అంతా అనుకున్నారు. అయితే చివరి నిమిషంలో ఆమె బిగ్ బాస్ ఆఫర్ రిజెక్ట్ చేశారు. అయితే పూజామూర్తి ఆఫర్ వదలుకోవడం వెనుక పెద్ద విషాదమే దాగి ఉంది
పూజామూర్తి ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇటీవలే ఆమె తండ్రి చనిపోయారు. ఆయన అకాల మరణంతో పూజా మూర్తి బిగ్ బాస్ ఛాన్స్ వదులుకున్నట్లు సమాచారం. పుట్టెడు దుఖంలో ఉన్న ఆమె.. తండ్రి జ్ఞాపకాలు తలుచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. తండ్రిని తలుచుకుంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు.
'RIP అంటే రిటర్న్ ఇఫ్ పాజిబుల్ (వీలైతే తిరిగి వచ్చేయండి) అయితే బాగుండని కోరుకుంటున్నా. ప్రతిక్షణం మిమ్మల్ని మిస్ అవుతున్నా. ప్రతి రోజు మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటా. మిమ్మల్ని గర్వపడేలా చేశానని అనుకుంటున్నా. తెలిసో, తెలియకో ఏదైనా పొరపాటు చేసి ఉంటే క్షమించు నాన్నా.. నువ్వు నాతోనే ఉంటావని నాకు తెలుసు. మీ ఆశీర్వాదాలు నాకు, అమ్మకు ఎల్లప్పుడూ ఉంటాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అంటూ పూజా మూర్తి ఇన్స్టాగ్రాం స్టోరీలో తండ్రితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సీజన్ ఫైనల్ లిస్ట్‌లో ఉంది పూజా మూర్తి. కానీ తండ్రి అకాల మరణంతో ఆమె షో నుంచి వైదొలగడంతో గుండమ్మ స్థానంలో అశోకవనంలో అర్జున కల్యాణం ఫేమ్ రితికా నాయక్ ను తీసుకున్నట్లు సమాచారం.