సలార్ రికార్డులు.. ప్రభాస్ చెప్పిన ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు
X
డార్లింగ్ స్టార్ ప్రభాస్ మానియా కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ నటించిన సలార్ దుమ్మురేపుతోంది. సలార్ ఈ ఏడాది ఫస్ట్ డే హయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచి ఓ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ రికార్డ్ను కంటిన్యూ చేస్తూ నెక్ట్స్ డే కూడా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్గా పర్ఫార్మ్ చేసింది. ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసిన ఖాన్సార్ వరల్డ్కు ఫ్యాన్స్ తో పాటు జనరల్ ఆడియన్స్ కూడా ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా హాలీవుడ్ మీడియాతో మాట్లాడిన రెబల్ స్టార్ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.
సలార్ మూవీలోని తన పాత్ర ఎంతో సవాల్తో కూడుకున్నదని ప్రభాస్ అన్నారు. కథ నచ్చడంతో వెంటనే సినిమాకు ఒకే చెప్పిట్లు తెలిపారు. సలార్ ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే.. రెండో పార్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుందని చెప్పారు. రాజమౌళి, ప్రశాంత్‌నీల్ వంటి దర్శకులతో పనిచేయడం గొప్ప అనుభూతిని ఇచ్చిందన్నారు. ‘‘బాహుబలి నా కేరీర్లో ఓ బెంచ్ మార్క్ను క్రియేట్ చేసింది. అందుకే ఆ తర్వాత ఎంచుకున్న సినిమాల్లో కొత్తదనం ఉండేలా చూసుకున్నా. ప్రేక్షకులు కూడా వైవిధ్యమైన కంటెంట్ను మాత్రమే ఇష్టపడుతున్నారు’’ అని ప్రభాస్ అన్నారు.