Home > సినిమా > పెళ్ళయిన 7నెలలకే చున్నీతో ఉరేసుకున్న హీరోయిన్ భర్త

పెళ్ళయిన 7నెలలకే చున్నీతో ఉరేసుకున్న హీరోయిన్ భర్త

పెళ్ళయిన 7నెలలకే చున్నీతో ఉరేసుకున్న హీరోయిన్ భర్త
X

60 ఏళ్ళ వయసులోనూ వన్నె తగ్గని అందం రేఖది. దక్షిణాది నుంచి బాలీవుడ్ కి వెళ్ళి టాప్ హీరోయిన్ గా వెలుగొందిన రేఖ జీవితంలో ప్రేయకథలెన్నో. అమితాబచ్చన్ తో ప్రేమ వ్యవహారం, జయాబచ్చన్ వార్నింగ్ ...దేశమంతా కథలుగా చెప్పుకుంది. తర్వాత క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ తో ప్రేమలో పడిందని....వినోద్ మెహ్రాను పెళ్ళి చేసుకుందని ఇలా చాలా రకాలుగా వార్తలు వచ్చాయి.

ఇలా చాలా రకాల ప్రేమకథలను నడిపిన రేఖ...చివరకు సినిమాలకు సంబంధించని ఓ వ్యాపారవేత్తను పెళ్ళాడింది. నాలుగు పార్టీల్లో కలిసారు అంతే పెళ్ళి చేసేసుకున్నారు. ముఖేష్ అగర్వాల్ మనం పెళ్ళి చేసుకుందామా అని అడగడం...దానికి రేఖ ఒప్పుకోవడంతో చాలా హడావుడిగా విహాహం అయిపోయింది. అయితే ఈ పెళ్ళి కూడా ఎన్నో రోజులు నిలవలేదు. మ్యారేజ్ అయిన 7నెలలకే ముఖేష్ రేఖ చున్నీతోనే ఉరి వేసుకుని చనిపోయారు.

దీనంతటకీ కారణం రేఖ సెక్రటరీ అని పుకార్లు అప్పట్లో పుట్టుకొచ్చాయి. అదే నిజమంటున్నారు యాజీర్ ఉస్మాన్ అనే రచయిత. రేఖ జీవితాన్ని ఈయన ఓ పుస్తకం గా తీసుకువచ్చారు. ఇందులో రేఖకు తన సెక్రటరీతో ఉన్న బంధాన్ని బట్టబయలు చేశారు. పర్జానా ఏం చెస్తే రేఖ అది చేసేవారని...రేఖ బెడ్రూమ్ లోకి వెళ్ళాలన్నా ఆమె పర్మిషన్ ఉండాల్సిందేనని చెబుతున్నారు. 30 ఏళ్ళపాటూ వీళ్ళిద్దరూ కలిసి పని చేశారు.సెక్రటరీ అనుమతి లేనిదే రేఖ ఒక్క అడుగు కూడా ముందుకు వేసేది కాదని రాసారు ఉస్మాన్. రేఖ భర్త ముఖేష్ మరణానికి కూడా ఫర్జానానే కారణమని పుస్తకంలో ప్రస్తావించారు. సింపుల్ గా చెప్పాలంటే ఆమెలేకుండా ఫర్జానా బతకలేదు అని రాసారు ఉస్మాన్ పుస్తకంలో రాసారు.ఫర్జాతో రేఖ సహజీవనం చేసిందని చాలా మంది అంటుంటారు. కానీ రేఖ మాత్రం వీటన్నిటినీ కొట్టిపారేస్తారు. ఫర్జానా తన సొంత సోదరిలాంటిది అని చెప్పేవారు.

Updated : 21 July 2023 5:56 PM IST
Tags:    
Next Story
Share it
Top