సలార్’ టీంలో టెన్షన్.. ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్
X
ఆదిపురుష్ సినిమా వివాదాలతో చిరాకులో ఉన్న ఫ్యాన్స్.. తమ ఆశలన్నీ సలార్ సినిమాపై పెట్టుకున్నారు. ఈ సినిమాతో హిట్ కొట్టి.. విమర్శకుల నోళ్లు మూయించాలని చూస్తున్నారు. అయితే, ఇదంతా ఇప్పట్లో జరిగేలా లేదు. సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన ఈ సినిమా.. మరోసారి పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మూవీ టీంలో టెన్షన్ మొదలయింది. అనుకున్న టైంలో రిలీజ్ చేయగలమా లేదా అనే ఆందోళనలో పడిపోయారు.
ఈ సినిమాలో విలన్స్ గా జగపతి బాబు, పృథ్విరాజ్ నటిస్తున్న విషయం తెలిసిందే. మూడు రోజుల క్రితం షూటింగ్ లో పృథ్విరాజ్ గాయపడ్డ విషయం తెలిసిందే. దీంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయి.. సర్జరీ చేసుకున్నారు. సర్జరీ తర్వాత డాక్టర్లు కూడా కొన్ని రోజులు పృథ్విరాజ్ ను రెస్ట్ తీసుకోమని చెప్పారు. అయితే, సినిమా షూటింగ్ లో పృథ్విరాజ్ చేయాల్సిన సీన్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. వాటిని త్వరగా పూర్తి చేసి సెప్టెంబర్ కల్లా రిలీజ్ కు రెడీ చేయాలని భావించారు మూవీ మేకర్స్. పృథ్విరాజ్ కు బెడ్ రెస్ట్ అవసరం అని డాక్టర్స్ చెప్పేసరికి మూవీ టీంలో టెన్షన్ మొదలయింది. దీంతో మూవీ వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.