‘మిస్టర్ ప్రెగ్నెంట్’కు నెలలు నిండుతున్నై.. డెలివరీ ఎప్పుడంటే..?
X
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఫేమ్ సయ్యద్ సోహెల్ రియాన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. రూపా కొడవాయుర్ హీరోయిన్ గా నటిస్తోంది. మైక్ మూవీస్ బ్యానర్ పై అన్నపరెడ్డి అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల నిర్మిస్తున్న ఈ సినిమాకు.. దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఫస్ట్ లుక్ నుంచే ఈ సినిమాపై అభిమానుల్లో హైప్ పెరిగిపోయింది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఇందులో సోహెల్ ప్రెగ్నెంట్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు వచ్చిన వినోదాత్మక, ప్రేమకథా చిత్రంగానే కాకుండా.. ఇప్పుడు ప్రయోగాత్మక చిత్రంగా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’వస్తోంది. దాంతో ఈ కాన్సెప్ట్ సినిమా అందరిలో ఆసక్తి నెలకొంది. తాజాగా అక్టోబర్ 18న సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాలో సుహాసినీ మణిరత్నం, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, హర్ష తదితరులు నటించారు.