Home > సినిమా > ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ విడుదల వాయిదా

‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ విడుదల వాయిదా

‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ విడుదల వాయిదా
X

అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తుంన్నారు. మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆగస్ట్ 4న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, తాజాగా ఈ సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు వస్తున్న వార్తలు చివరికి నిజం అయ్యాయి. సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించింది చిత్ర బృదం.

‘సినిమా విడుదలను వాయిదా వేస్తున్నందుకు మమ్మల్ని క్షమించండి. తర్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామ’ని ట్వీట్ చేసింది. కాగా,

పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం కావడంతో సినిమా విడుదలను వాయిదా వేస్తున్నారట. త్వరలోనే రిలీజ్ డేట్ ను ట్రైలర్ తో పాటు ప్రకటిస్తామని మూవీ టీం తెలిపింది. దీంతో నవీన్, అనుష్క ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు. నవీన్ స్టాండప్ కమీడియన్ గా, అనుష్క చెఫ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతోంది.



Updated : 29 July 2023 1:51 PM IST
Tags:    
Next Story
Share it
Top