నాన్నకు ప్రేమతో..ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్
X
నేడు సీని నటుడు, దివంగత ఎంపీ నందమూరి హరికృష్ణ 67వ జయంతి. ఈ సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ నాన్న మీద ఉన్న ప్రేమతో జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేశారు. నందమూరి హరికృష్ణ ఫోటోను షేర్ చేసి ఆ ఫోటోలోనే ఓ భావోద్వేగమైన మెసేజ్ రాశారు " ఈ అస్తిత్వం మీరు. ఈ వ్యక్తిత్వం మీరు. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు. ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే" అంటూ భావోద్వేగమయ్యారు ఎన్టీఆర్. ఈ ఫోటోలో మెసేజ్ కింద నందమూరి కళ్యాణ్ రామ్, నందమూరి తారకరామరావు అని రాసి ఉంది. దీంతో ట్విటర్లో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. నెల్లూరు జిల్లా కావలిలో తన అభిమాని వివాహానికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తుండగా నల్గొండలో జరిగిన ఓ యాక్సిడెంట్లో నందమూరి హరికృష్ణ చినిపోయిన విషయం తెలిసిందే.
కుమారులతో పాటు టీడీపీ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లు కూడా హరికృష్ణకు నివాళులు అర్పించారు. ఆయనను గుర్తు చేసుకున్నారు.ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం ట్విటర్లో ఓ పోస్ట్ పెట్టారు.సినీ రాజకీయ రంగాలలో ఎంతోమందికి ఆత్మీయుడిగా... ప్రజా బంధువుగా... నిండైన తెలుగుదనానికి ప్రతిరూపంగా తెలుగువారి అభిమానాన్ని పొందిన నందమూరి హరికృష్ణగారి జయంతి సందర్భంగా ఆయనతో నాకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ...హరికృష్ణ స్మృతికి నివాళులర్పిస్తున్నాను" అంటూ ఆయన పోస్ట్ పెట్టారు.
మీ 67వ జయంతి న మిమ్మల్ని స్మరించుకుంటూ... pic.twitter.com/MwPWPJ8VMD
— Jr NTR (@tarak9999) September 2, 2023
సినీ రాజకీయ రంగాలలో ఎంతోమందికి ఆత్మీయుడిగా... ప్రజా బంధువుగా... నిండైన తెలుగుదనానికి ప్రతిరూపంగా తెలుగువారి అభిమానాన్ని పొందిన నందమూరి హరికృష్ణగారి జయంతి సందర్భంగా ఆయనతో నాకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ... హరికృష్ణ స్మృతికి నివాళులర్పిస్తున్నాను pic.twitter.com/eqj1D0rYVQ
— N Chandrababu Naidu (@ncbn) September 2, 2023