Home > సినిమా > లైడిటెక్టర్ పెట్టి పరీక్షించుకోండి, రెండో పెళ్లి గ్యారంటీ.. రేణు దేశాయ్...

లైడిటెక్టర్ పెట్టి పరీక్షించుకోండి, రెండో పెళ్లి గ్యారంటీ.. రేణు దేశాయ్...

లైడిటెక్టర్ పెట్టి పరీక్షించుకోండి, రెండో పెళ్లి గ్యారంటీ.. రేణు దేశాయ్...
X

రవితేజ కొత్త మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ లో సామాజిక కార్యకర్త హేమలతా లవణం పాత్రలో నటించిన రేణు దేశాయ్ మంచి మార్కులు కొట్టేశారు. హేమలత పాత్రకు న్యాయం చేశారని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. ఈ మూవీ ప్రచారంలో భాగంగా ఆమె ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఇబ్బంది పడుతుంటే వైసీపీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. పవన్‌తో విడాకులు విషయంలో ఏం జరిగిందో ఇదివరకే చాలాసార్లు చెప్పానని, తనపై అనుమానాలు ఉంటే లైడిటెక్టర్‌తో పరీక్షించుకోవచ్చని ఆమె సవాల్ విసిరారు. ‘‘పవన్ గురించి అన్నీ నిజాలే చెప్పాను. దాచిపెట్టిందేమీ లేదు’’ అని అన్నారు.

పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంపై స్పందిస్తూ ‘‘ఆయన సీఎం కావాలనో లేకపోతే కాకూడదనో నేను కోరుకోను. ఒక సాధారణ వ్యక్తిగా సైతనం ఆయన వైపు ఉండలేను. అన్నీ దేవుడే చూసుకుంటాడు. పవన్ ఒక రాజకీయ నాయకుడిగా ఈ సమాజానికి అవసరం అని గతంలో అన్నాను. అది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం. ఎన్నికల్లో ఎవరి కోసమూ నేను ప్రచారం కూడా చేయను’’ అని స్పష్టం చేశారు. తను రెండో పెళ్లి కచ్చితంగా చేసుకుంటానని చెప్పారు. అయతే తన పిల్లలను బాధ్యతలు చూసుకోవాల్సి ఉంది. ఆద్యా గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నానని తెలిపారు. ‘‘నేనొక్కదాన్నే పిల్లలను పోషిస్తున్నాను. నా ఆరోగ్యం కూడా బావుండల్లేదు. అకీరాను హీరోగా చూడాలని ఉంది’’ అని అన్నారు.


Updated : 24 Oct 2023 12:59 PM IST
Tags:    
Next Story
Share it
Top