'అందుకే పవన్ కళ్యాణ్ నిన్ను తన్ని, తరిమేశాడు!'.. రేణూ దేశాయ్ రిప్లై ఏంటంటే
స్టార్ హీరో పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ ల జంట విడిపోయినప్పటి నుంచి పవన్ ఫ్యాన్స్, హేటర్స్.. చాలామంది రేణును టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి కామెంట్స్‌పై ఇప్పటికే రేణూ చాలాసార్లు స్పందించగా.. తనపై వస్తున్న ఆరోపణలను ఉద్దేశిస్తూ మరోసారి కామెంట్స్ చేసింది ప్రస్తుతం ఇవి కూడా నెట్టింట వైరల్‌గా మారాయి.
ఇటీవల పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నవారిపై ఓ వీడియో బైట్ రిలీజ్ చేసింది రేణు దేశాయ్. అందులో వ్యక్తిగతంగా పవన్ మోసం చేశారని చెబుతూనే రాజకీయంగా పవన్‌కే తన మద్దతు అని తెలిపింది. అందులో పవన్ కళ్యాణ్ సమాజానికి కావాల్సిన వ్యక్తి అని, తనకు ఓటు వేయండి అంటూ పవన్‌కు సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. దాని వల్ల పవన్ హేటర్స్ అంతా ఒక్కసారిగా ఆమెపై ఫైర్ అయ్యారు. ఒక నెటిజన్ అయితే ఏకంగా ‘‘అందుకే పవన్ కళ్యాణ్ నిన్ను తన్ని, తరిమేశాడు’’ అంటూ కామెంట్ చేశాడు. దానికి రేణూ దేశాయ్ రియాక్ట్ అయ్యింది. ‘‘నన్ను తిట్టడంతో నీకు మనశ్శాంతి లభించిందా? లేదంటే ఇంకా చెప్పండి. నా మాజీ భర్తను ఫాలో అయ్యేవారు లేదా ఆయనకు వ్యతిరేకంగా ఉండేవాళ్ల దగ్గర నుంచి తిట్లు వినడం మాత్రమే నా జీవితానికి అర్థం. కానివ్వండి’’ అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది.
దీంతో పాటు తన మనసులోని మాటలను కూడా బయటపెట్టింది. ‘‘నేను విడాకుల గురించి, నా మాజీ భర్త చేతిలో ఎలా మోసపోయాను అన్న విషయం గురించి మాట్లాడినప్పుడు తన ఫ్యాన్స్ నన్ను వేధింపులకు గురిచేశారు. ఇప్పుడు ఒక పౌరురాలిగా ఆయనకు సపోర్ట్‌గా నిజం మాట్లాడితే.. ఆయన హేటర్స్ నన్ను వేధిస్తున్నారు. ఒకప్పుడు విడాకుల గురించి మాట్లాడడానికి డబ్బు తీసుకున్నానని అనేవాళ్లు. ఇప్పుడు కూడా డబ్బు తీసుకునే మట్లాడుతున్నానని అంటున్నారు. నేను రెండు సందర్భాల్లో నిజం తప్పా ఇంకేమీ మాట్లాడలేదు. ప్రేమలో పడినందుకు, నిజాలు మాట్లాడినందుకు ఇదంతా అనుభవించక తప్పదేమో. ఒకవేళ ఇదే నా తలరాత ఏమో. ఇదే నా విధి అయితే అలాగే ఉండనీయండి. ఇంకా అనండి నన్ను’’ అంటూ రేణూ దేశాయ్.. ఓవైపు పవన్ అభిమానులతో పాటు తనను ద్వేషించే వారికి కూడా గట్టిగా సమాధానమిచ్చింది. తనను ఎంత వేధించినా తాను ఇంక పట్టించుకోనని తెగెసి చెప్పేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.