Home > సినిమా > Renu Desai : రేణూదేశాయ్ రెండో పెళ్లి ఎందుకు ఆగింది..

Renu Desai : రేణూదేశాయ్ రెండో పెళ్లి ఎందుకు ఆగింది..

Renu Desai : రేణూదేశాయ్ రెండో పెళ్లి ఎందుకు ఆగింది..
X

సెలబ్రిటీల మధ్య విడాకులు చాలా కామన్ అయిపోయాయి అనుకుంటారు చాలామంది. కానీ అసలు విడాకులే ఎప్పుడో కామన్ అయిపోయాయి. కాకపోతే సెలబ్రిటీస్ కాబట్టివారి గురించిన వార్తలు ఎక్కువ హైలెట్ అవుతాయి. ఇక పవన్ కళ్యాణ్ విషయంలో అప్పటికే ఆయన పొలిటికల్ గా కూడా యాక్టివ్ గా అయ్యాడు కాబట్టి అతని అపోజిట్ గా ఉన్నవాళ్లు మరింత హడావిడీ చేశారు. డివోర్స్ అనేది వారి వ్యక్తిగతం. కానీ దాన్ని పబ్లిక్ చేశారు. రకరకాలుగా వ్యాఖ్యానించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాస్త ఎక్కువ చేశారు కూడా. దీంతో ఒక దశలో రేణూదేశాయ్ ఓ దశలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. విడాకులు తర్వాత తనను వదిన అని పిలవొద్దని గట్టిగానే చెప్పింది. ఇక తమకు డివోర్స్ అయిన కొన్నాళ్లకు రేణూదేశాయ్ కూడా రెండో పెళ్లి చేసుకోవాలనుకుంది. ఒక వ్యక్తితో ఎంగేజ్మెంట్ కూడా అయింది. బట్ ఈ విషయంలో కూడా పవన్ ఫ్యాన్స్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అలాంటి వారందరికీ తను కూడా స్ట్రాంగ్ గానే కౌంటర్స్ ఇచ్చింది. తన ఎంగేజ్మెంట్ రింగ్ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టడం అప్పట్లో సంచలనం సృష్టించింది. మరి ఆ తర్వాతేమైందో.. పెళ్లి మాట మళ్లీ రాలేదు.

ప్రస్తుతం నటిగా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది రేణూదేశాయ్. టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హేమలత లవణం పాత్రను పోషిస్తోంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో ఆ పెళ్లి ప్రస్తావన వచ్చింది. అయితే తను రెండో పెళ్లికి సిద్ధమైన వ్యక్తి తన కుటుంబానికి చెందిన వాడేనట. ఎంగేజ్మెంట్ ఇష్టంగానే చేసుకున్నా.. తర్వాత తన పిల్లల గురించి ఆలోచించి క్యాన్సిల్ చేసుకున్నా అని చెప్పింది. ముఖ్యంగా పిల్లలకు తండ్రి దూరమయ్యాడు. పెళ్లితో తనూ దూరమైతే బావుండదనే కారణంతోనే ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకుని సింగిల్ మదర్ గా పిల్లలను చూసుకుంటున్నా అని చెప్పింది. సో.. తన ఎంగేజ్మెంట్ ఎందుకు క్యాన్సిల్ చేసుకుందీ అనే విషయంలో ఇప్పటికీ ఉన్న కొన్ని కన్ఫ్యూజన్స్ ను పూర్తిగా క్లియర్ చేసేసింది. సో.. ఇకపై ఆ ప్రస్తావన మళ్లీ ఎక్కడా రాకూడదేమో..


Updated : 18 Oct 2023 5:36 PM IST
Tags:    
Next Story
Share it
Top