నిజమా అనీలన్నా..? బాలయ్యతో రీమేక్ సినిమా చేస్తున్నావా..?
X
నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా దసరా కానుకగా విడుదల కానుంది. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నా. మాస్ యాక్షన్ జోనర్లో సాగే భగవంత్ కేసరిలో బాలకృష్ణ సాల్ట్ అండ్ పెప్పర్ లో కేక పుట్టిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా కాజల్ కనిపించనుంది. ఆయన కూతురి పాత్రలో శ్రీలీల నటిస్తోంది. కథ అంతా కూడా తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం ఓ లీక్ బాలయ్య అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.
ఈ సినిమా స్టోరీ లైన్ హిందీ సినిమా ఖుదా గవా సినిమా నుంచి తీసుకున్నట్లు తెలుస్తోంది. భార్య, స్నేహితుడి కోసం జైలు వెళ్తాడు హీరో. అతను జైల్ కు వెళ్లే సమయానికి హీరోయిన్ ప్రెగ్నెంట్. హీరో జైల్ లో ఉండగానే తన కూరుతు పెరిగి పెద్దదవుతుంది. జైల్ నుంచి విడుదలైన హీరో.. తన కూతురుకు తెలియకుండా శత్రువుల నుంచి తనను కాపాడుతుంటాడు. ఇప్పుడు అదే కథతో భగవంత్ కేసరి కూడా రాబోతుందని పుకార్లు వస్తున్నాయి. దీంతో బాలయ్య ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు. అనిల్ రావిపుడిని ‘ఈ పుకార్లు నిజమా’అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.