Home > సినిమా > అల్లు అర్జున్పై ఆర్జీవీ విమర్శలు.. ఓ కమెడియన్ మనవడు..

అల్లు అర్జున్పై ఆర్జీవీ విమర్శలు.. ఓ కమెడియన్ మనవడు..

అల్లు అర్జున్పై ఆర్జీవీ విమర్శలు.. ఓ కమెడియన్ మనవడు..
X

వివాదాలకు కేరాఫ్ రామ్ గోపాల్ వర్మ మరోసారి మెగా ఫ్యామిలీపై తన అక్కసు వెళ్లగక్కాడు. పుష్ప సినిమాలో తన నటనతో ఇరగదీసిన అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ లభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అంతా అల్లు అర్జున్ ను మెచ్చుకుంటూ.. శుభాకాంక్షలు తెలుపుతుంటే.. ఆర్జీవీ మాత్రం విమర్శిస్తూ ట్వీట్ పెట్టాడు. ఈ మధ్య ఆర్జీవీ తనకు మూడు వచ్చినప్పుడల్లా మెగా ఫ్యామిలీని, పవన్ కళ్యాన్ ను ఏకిపారేస్తున్నాడు. అభిమానిని అని చెప్తూనే కౌంటర్లు ఇస్తున్నాడు. జాతీయ అవార్డ్ తీసుకున్న వేళ.. విమర్శిస్తూ వర్మ చేసిన ట్వీట్ చర్చనీయాంశం అయింది.

‘టాప్ హీరోలకు బ్రదర్ గా అయినా, కొడుకుగా అయినా పుడితే.. ఇండస్ట్రీలో ఈజీగా సక్సెస్ అవ్వొచ్చు. కానీ, సూపర్ సక్సెస్ కావాలంటే కింది స్థాయి నుంచి మొదలై, అగ్రస్థానానికి చేరుకోవడం. కమెడియన్ మనవడు అయినా కూడా సూపర్ హీరోగా మారి.. బాక్సాఫీస్ వద్ద, అవార్డుల్లోనూ సంచలనం సృష్టించడమే మెగా సక్సెస్’అంటూ మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి చిచ్చుపెట్టే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుండగా.. అల్లు అర్జున్ దీనికి కౌంటర్ ఇస్తాడా.. లేక చూసి చూడనట్టు వదిలేస్తాడా అనేది ప్రశ్నగా మారింది. ఇటు మెగా, అల్లు ఫ్యాన్స్ అయితే ఆర్జీవీపై తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే ఈ ట్వీట్ వివాధం అవుతుందా లేక సర్ధుమనుగుతుందా చూడాలి.



Updated : 25 Aug 2023 12:32 PM GMT
Tags:    
Next Story
Share it
Top