Home > సినిమా > RGV వ్యూహంలో ఎవరీ ముగ్గరు..? మీరు కనిపెట్టారా.?

RGV వ్యూహంలో ఎవరీ ముగ్గరు..? మీరు కనిపెట్టారా.?

RGV వ్యూహంలో ఎవరీ ముగ్గరు..? మీరు కనిపెట్టారా.?
X



సంచలన దర్శకుడు ఆర్జీవీ డైరెక్ట్ చేసిన.. వ్యూహం ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది. ఇప్పటికే రాజకీయ నేపథ్యంలో పలు సినిమాలు తెరకెక్కించారు వర్మ. ఆయన సినిమాలకు ఓ స్పెషాలిటీ ఉంటుంది. సినిమాలోని నటీనటులు.. అచ్చం రియల్ క్యారెక్టర్స్‌ను తలపించేలా ఉంటాయి. ఇప్పటికే రిలీజ్ అయిన వ్యూహం సినిమా టీజర్ లో జగన్, చంద్రబాబు, వైఎస్ షర్మిల పాత్రలు అచ్చం అలానే దింపారు ఆర్జీవీ. ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. తాజాగా ఈ సినిమాలోని మరో ప్రధానమైన పాత్రలను ట్విటర్ ద్వారా పరిచయం చేశారు.

ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ ఫోటో చూస్తుంటే... ఆ ముగ్గురి క్యారెక్టర్స్ ఎవరెవరివో ఈజీగా తెలిసిపోతోంది. వ్యూహంలో ఎవరు అంటూ పోస్ట్ చేసిన ఆ ఫోటోలో.. పవన్ కళ్యాణ్, చిరంజీవి, అల్లు అరవింద్ పాత్రలను పరిచయం చేస్తున్నట్లు అనిపిస్తోంది. అయితే శనివారం విడుదలైన ఈ మూవీ టీజర్ చూశాక.. వ్యూహం సినిమాలో సోనియాగాంధీని చెడుగా చూపించే ప్రయత్నం జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. సోనియాను చెడుగా చూపెడితే వర్మని బట్టలూడదీసి కొడతామని వార్నింగ్ ఇచ్చారు.




Updated : 26 Jun 2023 2:02 PM IST
Tags:    
Next Story
Share it
Top