Home > సినిమా > యానిమల్ సినిమా చూడనివాడు యానిమల్: ఆర్జీవీ

యానిమల్ సినిమా చూడనివాడు యానిమల్: ఆర్జీవీ

యానిమల్ సినిమా చూడనివాడు యానిమల్: ఆర్జీవీ
X

సందీప్ రెడ్డి వంగ, రణ్బీర్ కపూర్ కాంబీనేషన్ లో వచ్చిన సినిమా యానిమల్.. డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మొదటి షో నుంచే హిట్ టాక్ ను సొంతం చేసుకున్న యానిమల్.. రికార్డు కలెక్షన్స్ సృష్టిస్తుంది. ఫాదర్ సెంటిమెంట్, యాక్షన్ జానర్ లో రిలీజైన ఈ సినిమా.. హౌస్ ఫుల్ టాక్ తో దూసుకెళ్తుంది. మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ.116 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి సంచలనం సృష్టించింది. కాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా యానిమల్ సినిమాపై 4 పేజీల రివ్యూ రాసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి సినిమా సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నాడు. తాజాగా మరో ట్వీట్ చేసి తనదైన పంథాను చాటుకున్నాడు ఆర్జీవీ.

‘యానిమల్ సినిమా కాదు. ఓ స్టేట్మెంట్. ఇప్పటికీ ఈ సినిమా చూడకపోతే.. మీరూ నిజమైన యానిమల్ తో సమానం’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రుస్తుతం ఆ ట్వీట్ వైరల్ అవుతుంది. యానిమల్ సినిమాపై ప్రశంసలు కురిపించిన వర్మ.. సందీప్ వంగ మునుపెన్నడూ చూడని సీన్లను అద్భుతంగా చూపించాడని అన్నారు.

Updated : 8 Dec 2023 6:49 PM IST
Tags:    
Next Story
Share it
Top