ట్రక్కు బ్రేకులు ఫెయిల్...10 మంది మృతి
Mic Tv Desk | 4 July 2023 2:44 PM IST
X
X
మహారాష్ట్రలోని ధులే జిల్లాలో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైవేపై ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో అదుపుతప్పి ..ముందున్న వాహనాలను ఢీ కొట్టింది. అనంతరం ఓ హోటల్ లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. ధులేలోని ముంబై-ఆగ్రా హైవేపై పలాస్నేర్ గ్రామ సమీపంలో ఉదయం 10.45 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను శిర్పూర్, ధూలేలోని ఆసుపత్రికి తరలించారు.
Updated : 4 July 2023 2:44 PM IST
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire