'భరతనాట్యం' నుంచి రొమాంటిక్ సాంగ్.. ట్యూన్, లిరిక్స్ వహ్ వా!
X
టాలీవుడ్‌లో 'దొరసాని' వంటి హిట్ మూవీ తీసిన దర్శకుడు కేవీఆర్ మహేంద్ర ఇప్పుడు 'భరతనాట్యం' మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ మూవీతో సూర్య తేజ, మీనాక్షి గోస్వామి హీరోహీరోయిన్లుగా తెలుగు స్క్రీన్‌పై ఎంట్రీ ఇస్తున్నారు. పాయల్ షరఫ్ నిర్మిస్తోన్న ఈ మూవీకి యంగ్ డైనమిక్ మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి 'చేశావు ఏదో మాయ' అనే రిలికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.
సినిమా ఈజ్ ది మోస్ట్ బ్యూటీఫుల్ ఫ్రాడ్ ఇన్ ది వరల్డ్ అనే ట్యాగ్ లైన్‌తో 'భరతనాట్యం' కుర్రకారును ప్రేమలోకంలోకి తీసుకెళ్లడానికి సిద్ధమవుతోంది. 'భరతనాట్యం' అనే క్లాసిక్ టైటిల్ పెట్టడానికి కారణం తెలియాలంటే కాస్త ఆగాల్సిందే. ఇక తాజాగా ఈ మూవీ నుంచి విడుదలైన 'చేశావు ఏదో మాయ' లిరికల్ వీడియో సాంగ్ అందర్నీ ఆకట్టుకుంటోంది. భాస్కర భట్ల సాహిత్యం అందించిన ఈ పాటను ఆదిత్య ఆర్కే, యషికా సిక్క ఆలపించారు.
హార్డ్ టచింగ్ మెలోడీస్‌ను అందించే వివేక్ సాగర్ ఈసారి 'చేశావు ఏదో మాయ'తో ఏదో మాయ చేశాడని అనిపిస్తుంది. హీరోహీరోయిన్ల మధ్య సాగే రొమాంటిక్ సాంగ్‌కు అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. 'కలవరమాయే కలమొదలాయే..కళ్లు కళ్లు పలకరింపులే ఎడారిలో తొలకరింపులే..అంటూ సాగే ఈపాట అందరి మనసును దోచేస్తోంది. కలువల కనులకు వహ్ వా..ఎగిరిన కురులకు వహ్ వా..అనే పదాల అల్లిక హార్ట్‌ను మెల్ట్ చేస్తాయంతే.
పాట వింటుంటే కొత్త లోకంలోకి వెళ్లిపోతాం. సాంగ్‌లో వచ్చే హమ్మింగ్స్ వారెవ్వా అనిపిస్తాయి. వింటున్నంత సేపు మనసుకు హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక ప్రేమికులు అయితే లవర్‌తో పాటు పాటను వింటే ఫుల్ జోష్‌లోకి వెళ్లిపోతారు. అద్భుతమైన ట్యూన్స్, లిరిక్స్‌తో సాగే ఈ రొమాంటిక్ సాంగ్‌ను మీరూ చూసేయండి మరి.