Home > సినిమా > Bigg Boss 7 Pallavi Prashanth : రైతు బిడ్డకు కోట్ల ఆస్తి ఉందా?..ప్రశాంత్ తండ్రి ఏమన్నారంటే...

Bigg Boss 7 Pallavi Prashanth : రైతు బిడ్డకు కోట్ల ఆస్తి ఉందా?..ప్రశాంత్ తండ్రి ఏమన్నారంటే...

Bigg Boss 7 Pallavi Prashanth : రైతు బిడ్డకు కోట్ల ఆస్తి ఉందా?..ప్రశాంత్ తండ్రి ఏమన్నారంటే...
X

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్‏లో ఓ సామాన్యుడికి స్థానం ఉంటుందా?అనే ప్రశ్నకు సమాధానంగా నిలిచాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. బిగ్ బాస్ హిస్టరీలోనే ఎన్నడూ లేనివిధంగా మొదటిసారిగా ఓ రైతు బిడ్డ అయిన, స్వయంగా రైతు అయిన మట్టిలో మాణిక్యం పల్లవి ప్రశాంత్ హౌస్‎లో ఎంటర్ అయ్యాడు. పొలం పనుల గురించి చెబుతూ...రైతు పడే కష్టాలను వివరిస్తూ సోషల్ మీడియా ద్వారా తనకంటూ ఓ ఇమేజ్‎ను సృష్టించుకున్నాడు ప్రశాంత్ . ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‎లోనూ సెలబ్రిటీలతో సమానంగా గేమ్ ఆడుతూ ప్రేక్షకుల ఆదరణను పొందుతున్నాడు. ఈ షోలో రైతు బిడ్డకు ప్రజలు ఫుల్ సపోర్ట్‎గా నిలుస్తున్నారు. సోషల్ మీడియా స్టార్స్ కూడా రైతుబిడ్డకు మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో నెట్టింట్లో ప్రస్తుతం ప్రశాంత్‎కు సంబంధించిన ఓ రూమర్ వైరల్ అవుతోంది. రైతుబిడ్డి పేదవాడు కాదని, అతనికి 26 ఎకరాల భూమి ఉందని, నాలుగు కాస్ట్లీ కార్లతో పాటు కోట్ల ఆస్తి ఉందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ రూమర్ పై పల్లవి ప్రశాంత్‌ తండ్రి స్పందించాడు.

పల్లవి ప్రశాంత్‌ తండ్రి మాట్లాడుతూ.. " ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. కావాలనే ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్నారు. కోట్ల ఆస్తి ఉందంటున్నారు. ఉంటే ఎక్కడుందో చూపించండి. 26 ఎకరాలు ఉంటే నా కొడుకు బిగ్‌బాస్‌కు ఎందుకు వెళ్తాడు? ఖరీదైన కార్లు ఉంటే వ్యవసాయం కాకుండా ప్రశాంత్ ఉద్యోగమే చేసుకునేవాడు. నాకుంది 6 ఎకరాల భూమి. ఆ భూమిని అందరికీ పంచితే నా కొడుక్కి మిగిలేది రెండెకరాలే. నాకు అర్థం కాదు రైతులను ఎప్పుడూ చిన్నచూపే ఎందుకు చూస్తారు. బిగ్‌బాస్‌ ఇంట్లో కూడా చాలా మంది నా కొడుకుని తక్కువ చేస్తూ మాట్లాడుతున్నారు. ఆ మాటలు వింటుంటే తట్టుకోలేకపోయాను. ఒకవేళ నా కొడుకు బిగ్‌బాస్‌ గెలిస్తే అతని ఇష్టప్రకారమే ఆ డబ్బు నిరుపేద రైతులకు ఇస్తే అంతకన్నా ఆనందం ఏముంది. వ్యవసాయాన్ని నమ్ముకున్న ఎంతోమంది రైతులు మా కళ్లముందే చనిపోయారు. రైతులు పడే కష్టాలు ఏంటో మాకు మాత్రమే తెలుసు"అని ప్రశాంత్‌ తండ్రి తెలిపారు.

Rythu Bidda pallavi prashanth father gives clarity on crores worth properties

Rythu Bidda, pallavi prashanth , pallavi prashanth father, clarity on crores worth properties, Rumours, farmer, Bigg Boss,Bigg Boss7 season, Bigg Boss7 telugu, Nagarjuna, Maa tv, Television, entertainment, latest news, Bigg Boss7 contestants,

Updated : 22 Sept 2023 2:36 PM IST
Tags:    
Next Story
Share it
Top