Home > సినిమా > నిహారిక మీద బ్యాడ్ కామెంట్స్-తిట్టిపోసిన తేజ్ బావ

నిహారిక మీద బ్యాడ్ కామెంట్స్-తిట్టిపోసిన తేజ్ బావ

నిహారిక మీద బ్యాడ్ కామెంట్స్-తిట్టిపోసిన తేజ్ బావ
X

నీహారిక కొణిదెల కొన్ని రోజులగా వార్తల్లో మనిలుస్తోంది. పబ్ లో అర్ధరాత్రి దొరిక దగ్గర నుంచీ సోషల్ మీడియాలో ఆమె మీద విపరీతంగా ట్రోలింగ్ అవుతోంది. చైతన్య తో విడిపోయినప్పుడు కూడా అతనిని ఏమీ అనలేదు కానీ నిహారికను మాత్రం చాలా మాటలు అన్నారు. అయినా కూడా అవన్నీ పట్టించుకోకుండా తన కెరీర్ లో ముందు వెళుతోంది. తాజాగా తేజ్ పెట్టిన ఓ పోస్ట్ లో నిహారిక కామెంట్ పెట్టింది. దానికి రిప్లైగా ఎవరో ఒకతను ఆమె మీద నెగటివ్ గా కామెంట్ చేశాడు.

సాయి ధరమ్ తేజ్ ఫ్రెండ్ నవీన్ కృష్ణ తీసిని ఒక షార్ట్ ఫిల్మ్ లో ఆయన నటించాడు. కలర్స్ స్వాతి, సాయి ధరమ్ ఇందులో జంటగా నటించారు. దీనిలో ఒక పాటను మొన్న ఆగస్టు 15న విడుదల చేశారు. సోల్ ఆఫ్ సత్య పేరుతో రిలీజ్ అయిన ఈ పాటను సాయి ధరమ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు. అందులో నిహారిక, వావ్ నేను ఈ పాట కోసం ఎంతో వెయిట్ చేస్తున్నా అంటూ కామెంట్ పెట్టింది. దానికి రిప్లైగా వీటి మీద ఉన్న శ్రద్ధ ఫ్యామిలీ మీద లేదు అంటూ హార్ష్ గా కామెటం్ చెట్టాడు. ఇది సాయి ధరమ్ కు కోపం తెచ్చింది. మీరు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది అంటూ స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చాడు. వెంటనే కామెంట్ ను డిలీట్ చేయమని కూడా చెప్పాడు.

నిహారికకు సాయి ధరమ్ తేజ్ అండగా నిలబడడం అందరినీ ఆకట్టుకుంది. అయితే ఆ కామెంట్ ను వెంటనే డిలీట్ చేశారు. నెగటివ్ కామెంట్తో పాటూ సాయి ధరమ్ ది కూడా డిలీట్ చేసేసారు. కానీ అంతకు ముందే ఈ వార్త జనాల్లోకి వెళ్ళిపోయింది. మొత్తానికి మరదలి కోసం బావ చేసిన పని అందరికీ నచ్చింది అంటున్నారు.


Updated : 17 Aug 2023 5:39 PM IST
Tags:    
Next Story
Share it
Top