Sai pallavi: కొత్త సంవత్సర వేడుకల్లో సాయిపల్లవి.. ఫ్యాన్స్ ఫిదా
X
సినీ ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. చేసింది కొన్ని సినిమాలే అయినా.. తన అభినయం, నటనతో గొప్ప పేరు తెచ్చుకుంది ఈ తమిళ అందం. చాలామంది ఆమె సింప్లిసిటీని కూడా తెగ ఇష్టపడుతుంటారు. పబ్లిక్ ఫంక్షన్‌లలో ఆమె వేషభాషలను కొనియాడుతుంటారు. సాయి పల్లవికి ఆధ్యాత్మిక కూడా చాలా ఎక్కువ. అందుకే కొత్త సంవత్సర వేడుకలను కూడా ఆమె అదే రీతిలో జరుపుకున్నారు. కొత్త సంవత్సరం 2024లోకి అడుగుపెడుతున్న వేళ (జనవరి 1) పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా ఆలయం ‘ప్రశాంతి నిలయం’లో జరిగిన ఆధ్యాత్మిక వేడుకల్లో సాయి పల్లవి పాల్గొన్నారు. చక్కనైన చీర కట్టు, నుదుటన బొట్టుతో సంప్రదాయబద్ధంగా ఆమె భజనలో పాల్గొన్నారు. కొత్త సంవత్సర సందర్భాన్ని దేవుడి సన్నిధిలో ఆధ్యాత్మికతతో జరుపుకున్నారు.
సత్యసాయి సన్నిధిలో భక్తి పాటలకు సాయి పల్లవి లీనమయ్యారు. కళ్లు మూసుకొని ఆధ్యాత్మికతలో మునిగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‍గా మారాయి. ఈ వీడియోని చూసి సాయి పల్లవిని చాలా మంది ప్రశంసిస్తున్నారు. ఇతర సినీ సెలెబ్రిటీలతో పోలిస్తే భిన్నంగా ఆధ్యాత్మికతతో కొత్త సంవత్సర వేడుకలను జరుపుకున్నదని పొగుడుతున్నారు నెటిజన్లు. మా సాయి పల్లవి బంగారం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా సాయి పల్లవి ఆధ్యాత్మికతను ప్రశంసిస్తున్నారు.