Home > సినిమా > ఛీ..ఛీ..మరీ ఇంత నీచంగా ఆలోచిస్తారా?..సాయి పల్లవి

ఛీ..ఛీ..మరీ ఇంత నీచంగా ఆలోచిస్తారా?..సాయి పల్లవి

ఛీ..ఛీ..మరీ ఇంత నీచంగా ఆలోచిస్తారా?..సాయి పల్లవి
X

సౌత్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి పెళ్లి చేసుకుంది... సాయి పల్లవి ఎవరిని పెళ్లి చేసుకుందో తెలుసా?... ఆ డైరెక్టర్‎తో సాయి పల్లవి పెళ్లి అయిపోయింది.... ఇదిగో సాక్ష్యం.. అంటూ గత కొంత కాలంగా యూట్యూబ్ ఛానళ్లలో , నెట్టింట్లో సాయిపల్లవి ,దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియస్వామి పక్కపక్కనే ఉన్న ఓ ఫోటో వైరల్ అవుతోంది. అయితే ఈ న్యూస్‎పైన ఆ ఫోటోపైన ఇప్పటికే డైరెక్టర్ వేణు ఊడుగుల స్పష్టతను ఇచ్చారు. ఇదే క్రమంలో నటి సాయి పల్లవి కూడా ట్విటర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టి ఓ రేంజ్‏లో తనపై వస్తున్న పెళ్లి రూమర్‎పై ఫైర్ అయ్యింది. నిజానికి నేను రూమర్స్ పట్టించుకోను కానీ నా ఫ్యామిలీ మెంబర్స్‎ను , ఫ్రెండ్స్‎ను ఇందులోకి లాగితే అస్సలు ఊరుకోనంటూ మండి పడింది.

ట్విటర్ వేదికగా స్పందిస్తూ..."వాస్తవానికి నేను రూమర్స్‌ను పట్టించుకోను. కానీ ,నా ఫ్యామిలీ మెంబర్స్‎ను , ఫ్రెండ్స్‎ను ఇందులోకి లాగుతున్నారు కాబట్టే స్పందించాల్సి వస్తోంది. ఓ సినిమా పూజా కార్యక్రమంలో పాల్గొన్న నా ఫొటోలను క్రాప్‌ చేశారు. నాకు పెళ్లైందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. డబ్బు కోసం ఇంత నీచంగా ఆలోచిస్తారా. నా మూవీస్ అప్‎డేట్స్‎ను చెప్పాలనుకునే సమయంలో ఇలాంటి పనికిమాలిన విషయాలపై రియాక్ట్ అవ్వడం చాలా బాధగా ఉంది. ఒక వ్యక్తిని ఇంతలా ఇబ్బంది పెట్టడం నిజంగా నీచమైన చర్యే" అంటూ సాయి పల్లవి తప్పుడు వార్తలు ప్రచురించే వారిపై మండిపడింది.

ప్రస్తుతం సాయిపల్లవి డైరెక్టర్ రాజ్‌కుమార్‌ పెరియస్వామితో ఓ మూవీ చేస్తోంది. ‘SK21’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈమధ్యనే పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంది. మరోవైపు చందూ మొండేటి దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్యతోనూ సాయి పల్లవి నటిస్తోంది. ప్రీ ప్రొడక్షన్స్‌ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ మూవీ #NC23 అనే వర్కింగ్‌ టైటిల్‌తో సిద్ధమవుతోంది.


Updated : 22 Sept 2023 5:51 PM IST
Tags:    
Next Story
Share it
Top