Saif Ali Khan: ఆదిపురుష్ డిజాస్టర్.. లంకేశ్ రెస్పాన్స్ ఇదే
X
ఆదిపురుష్ ఎంత పెద్ద డిజాస్టర్ ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రాఘవ, జానకి, శేషు అంటూ కొత్త పేర్లు పెట్టి రామాయాణాన్ని కాస్త వెరైటీగా చూపించాడు దర్శకుడు ఓం రౌత్. ఆ సినిమా విడుదలైనప్పటినుంచి.. ఇటీవలె సంక్రాంతి రేసులో బిగ్గెస్ట్ కొట్టిన హనుమాన్ సినిమా వరకూ దారుణంగా ట్రోల్స్ ను ఎదుర్కొంటున్నాడు. టి సిరీస్-రెట్రోఫైల్స్ సంయుక్త నిర్మాణంలో తెలుగు, హిందీ, తమిళ, మళయాళ, కన్నడ భాషల్లో రిలీజైన ఈ సినిమాను దాదాపుగా 103 రోజులపాటు షూట్ చేశారు. గ్రాఫిక్స్ వర్క్ కోసం వందల కోట్లు ఖర్చు పెట్టి వాయిదాలు వేస్తూ వేస్తూ చివరికి గతేడాది జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు.
సినిమాను చూసిన ప్రేక్షకులకు స్క్రీన్ మీద నడుస్తున్నది రామాయణమా? ఇంకేదైనా స్టోరీనా అనే అనుమానం వచ్చిందంటే ఆశ్చర్యపోక తప్పదు. ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి.. కొన్ని రోజుల వరకూ మూవీ టీమ్ పెద్దగా మాట్లాడలేదు. ఈ మూవీలో లంకేశ్ (రావణాసురుడు) గా నటించిన సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) లుక్‌పై అనేక విమర్శలు వచ్చాయి. కాగా ఈ సినిమా డిజాస్టర్‌పై ఆ నటుడు 7 నెలల తర్వాత ఫస్ట్ టైమ్ స్పందించారు.‘కొన్ని సినిమాలు చేసేటపుడు రిస్క్ చేయాలి..ఓటమిని ఎదుర్కోవాలి..నా పేరెంట్స్ పెద్ద స్టార్స్ అయినా సింపుల్‌గా ఉండేవారు. వారిలాగే నేను పెద్ద స్టార్ అని ఫీల్ అవను. వాస్తవంలో బతుకుతాను. ఆదిపురుష్ వంటి సినిమా ఫెయిల్ అయినంత మాత్రాన ఓటమితో భయపడను..ఒక్కోసారి చేసే ప్రయత్నాలు విఫలమైనపుడు అధైర్య పడకూడదు.. నెక్ట్స్ సినిమాలో చూసుకుందామని ముందుకు సాగాలి.. నేను అదే ఫాలో అవుతానని’ సైఫ్ అలీఖాన్ చెప్పారు. సైఫ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
సైఫ్ అలీ ఖాన్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. దేవర సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. దేవరలోసైఫ్ అలీ ఖాన్ తన యాక్టింగ్ స్కిల్స్ తో విలన్ గా ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాలి. సైఫ్ అలీ ఖాన్ రెమ్యునరేషన్ 10 నుంచి 12 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.