దేవరలో సైఫ్ లుక్ రివీల్ చేసిన మూవీ టీమ్
X
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీయార్ నటిస్తున్న సినిమా దేవర. సముద్రంతో ముడిపడి ఉన్న కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా 2024 ఏప్రిల్ 5న విడుదల అవనుంది. శివకొరటాల దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ కూడా నటిస్తున్నారు.
దేవర సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు. సైఫ్ ఇప్పటికే చాలాసార్లు హైదరాబాద్ రావడం...సినిమా షూటింగ్ లో పాల్గొనడం కూడా అయింది. ఈరోజు సైఫ్ పుట్టినరోజు. అందుకే మూవీ టీమ్ దేవరలో అతని లుక్ ను రివీల్ చేసింది. భైరా...హ్యాపీ బర్త్ డే సైఫ్ సర్ అంటూ స్వయంగా ఎన్టీయారే సైఫ్ లుక్ ని రిలీజ్ చేశారు. లాంగ్ హెయిర్ తో సైఫ్ చాలా భయంకరంగా కనిపిస్తున్నాడు. ఇందులో కూడా సముద్రం, పడవలు ఉండేట్టు డిజైన్ చేశారు మూవీ టీమ్.
దేవర సినిమాలో ఇప్పటికే ఎన్టీయర్, జాన్వీ కపూర్ లుక్ లను విడుదల చేశారు. వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సైఫ్ లుక్ కూడా ఢిఫరెంట్ గా ఉండడంతో ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. దానికి తోడు దేవర లాంచ్ టైమ్ లో చావుకి కూడా భయపడని రాక్షసుడు సైఫ్ అని కొరటాల శివ చెప్పారు. ఆచార్య తో డిజాస్టర్ ను సొంతం చేసుకున్న శివకొరటాల దేవర సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతీ పాత్రను చక్కగా తీర్చిదిద్దుతున్నారని చెబుతున్నారు టీమ్.
BHAIRA
— Jr NTR (@tarak9999) August 16, 2023
Happy Birthday Saif sir !#Devara pic.twitter.com/DovAh2Y781