Home > సినిమా > డంకీ Vs సలార్.. షారుక్‌తో పోటీపడనున్న ప్రభాస్!!

డంకీ Vs సలార్.. షారుక్‌తో పోటీపడనున్న ప్రభాస్!!

డంకీ Vs సలార్.. షారుక్‌తో పోటీపడనున్న ప్రభాస్!!
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సలార్.. ఈ సినిమాకు కెజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం టీమ్ పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో సూపర్ బిజీగా ఉంది. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదలకానుందని టీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా విడుదల రద్దయింది. ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ కంప్లీట్ కాలేదని.. ఈ నేపథ్యంలో డిసెంబర్‌కు వాయిదా వేశారు.

అయితే లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమా విడుదల తేది ఖరారు అయ్యినట్లు తెలుస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 22న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందని ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఈ విషయంలో త్వరలో సలార్ టీమ్ ఓ అధికారిక ప్రకటన చేయనుందని తెలిపారు. అయితే ఇదే తేదీన ఇప్పటికే షారుక్‌ఖాన్‌ ‘డంకీ’ చిత్రం విడుదల ఖరారైన సంగతి తెలిసిందే. ఇప్పటికే పఠాన్, జవాన్ సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉన్న షారుక్.. డంకీతో హ్యాట్రిక్ హిట్ కొట్టి మరో సెన్సేషన్ క్రియేట్ చేసే ప్లాన్‌లో ఉన్నాడు. మరోవైపు వరుస ఫ్లాప్‌ల కారణంగా చల్లబడ్డ డార్లింగ్ ఫ్యాన్స్‌కు.. సలార్‌తో మీ ఆకలి తీరుస్తా అని మాటిచ్చాడు. ఇంతకుముందు కూడా షారుక్ తో పోటీపడ్డాడు ప్రశాంత్ నీల్. 2018 డిసెంబర్‌ 21 న షారుఖ్ Zero తో వచ్చి అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వగా.. అదే రోజు ప్రశాంత్ నీల్ తన మొదటి చిత్రం KGF ను రిలీజ్ చేశాడు. ఇక ఆ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. అప్పటి వరకూ మనకెవరికీ తెలియని యశ్ ను పాన్ ఇండియా స్టార్‌ను చేసిందీ సినిమా. ఆ తర్వాత వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన KGF2 కూడా రికార్డులు క్రియేట్ చేసింది. అది వేరే సంగతి.

మళ్లి 5 ఏండ్ల తర్వాత షారుక్-ప్రశాంత్ నీల్ ల సినిమాలు ఒకే రోజు రిలీజ్ కాబోతున్నాయని టాక్. మొత్తానికి అటు షారుక్.. ఇటు ప్రభాస్ సినిమాలు ఒకేరోజు విడుదల కాబోతుందన్న వార్తలతో సినీ ఫ్యాన్స్.. తెగ సంబరపడిపోతున్నారు. చూడాలి మరి ఏం జరుగనుందో. ఇక సలార్ లో జగపతి బాబు, ఈశ్వరి రావు, శ్రియ రెడ్డి, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు చేస్తున్నారు. విజయ్ కిరగందూర్ నిర్మిస్తుండగా రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఇండియన్ భాషల్లోనే కాకుండా పలు అంతర్జాతీయ భాషల్లోను విడుదలవుతోంది

Updated : 26 Sept 2023 9:28 AM IST
Tags:    
Next Story
Share it
Top