Home > సినిమా > సలార్ సెన్సార్ రిపోర్ట్ ఏంటీ..?

సలార్ సెన్సార్ రిపోర్ట్ ఏంటీ..?

సలార్ సెన్సార్ రిపోర్ట్ ఏంటీ..?
X

డార్లింగ్ స్టార్ ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమరన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా సలార్. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్2 తర్వాత డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో ప్రపంచమంతటా భారీ అంచనాలున్నాయి. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కాస్త కేజీఎఫ్ ఫ్లేవర్ లోనే కనిపిస్తోంది. ఆ మూవీలో మదర్ సెంటిమెంట్ ను నమ్ముకున్న ప్రశాంత్ నీల్ ఈ సారి స్నేహాన్ని నమ్ముకున్నాడు. ఇద్దరు ప్రాణమిత్రులు కథతో సలార్ రూపొందించాడు. సలార్ లో రెగ్యులర్ హీరోయిన్ లు ఉండరు అని గతంలోనే చెప్పి ఉన్నాడు. అందుకు తగ్గట్టుగానే శ్రుతి హాసన్ కు ఈ మూవీలో పెద్దగా స్పేస్ ఉండదని ట్రైలర్ చూస్తేనేఅర్థమైంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ మూవీ సెన్సార్ పూర్తయింది.

సలార్ మూవీకి సెన్సార్ బోర్డ్ నుంచి ‘‘ఏ’’ సర్టిఫికెట్ వచ్చింది. అంటే సలార్ కేవలం అడల్ట్స్ కే పరిమితం అన్నమాట. దీన్ని బట్టి ఈ సినిమాలోనూ వయొలెన్స్ ఓ రేంజ్ లో ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. తెరంతా రక్తపాతం జరగబోతోందనుకోవచ్చు.

ఇక సలార్ మూవీ నిడివి కూడా పెద్దదే. ఏకంగా 2 గంటల 55 నిమిషాలకు పైగా నిడివి ఉంది. ప్రభాస్ లాంటి స్టార్ తో దాదాపు మూడు గంటల సినిమా అంటే పెద్ద విషయమేం కాదు. కాకపోతే కంటెంట్ కూడా బలంగా ఉండాలి. అప్పుడే వర్కవుట్ అవుతుంది. లేదంటే ఈ నిడివి వల్లే ఇబ్బంది పడాల్సి వస్తుంది. మొత్తంగా సలార్ ఎన్నో రికార్డ్ లు బద్ధలు కొడుతుందనే టాక్ బలంగా ఉంది. అది నిజమా కాదా అనేది డిసెంబర్ 22న తేలిపోతుంది.

Updated : 9 Dec 2023 4:28 PM IST
Tags:    
Next Story
Share it
Top