ప్రభాస్ కు హిట్ వస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు
X
సలార్ బ్లాక్ బస్టర్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ తో సమానంగా సంబరాలు చేసుకుంటున్నారు. కంటెంట్ ఎలా ఉన్నా హీరో ఎలివేషన్స్ తో ప్రశాంత్ నీల్ చూపించిన గూస్ బంప్స్ మూమెంట్స్ కు థియేటర్స్ ఊగిపోతున్నాయి. సలార్ లో ఆయన ప్రభాస్ ను ప్రజెంట్ చేసిన విధానం చూసి మాస్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ లా అనిపించింది. అందుకే కంటెంట్ వీక్ గా ఉన్నా సలార్ కలెక్షన్స్ మాత్రం స్ట్రాంగ్ గా ఉన్నాయి. ప్రస్తుతం సలార్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోందనే చెప్పాలి. నిన్నటి వరకూ నార్త్ లో సలార్ కంటే షారుఖ్ ఖాన్ డంకీ చిత్రానికి ఎక్కువ థియేటర్స్ ఇచ్చిన వాళ్లు కూడా ఇప్పుడు డంకీని తీసేసి సలార్ పోస్టర్స్ వేస్తున్నారు. అంటే ఈ సినిమా ఎంత పెద్ద కమర్షియల్ విజయం సాధించబోతోందో అర్థం చేసుకోవచ్చు. కేజీఎఫ్ రెండు భాగాల తర్వాత మరోసారి తను ఎంత పెద్ద మాస్ డైరెక్టర్ అనేది ప్రూవ్ చేసుకున్నాడు ప్రశాంత్ నీల్. అయితే అతని తర్వాతి మూవీ ఎన్టీఆర్ తో కావడంతో ఫ్యాన్స్ కూడా మరింత జోష్ గా ఉన్నారు.
ఏ దర్శకుడైనా ఓ బ్లాక్ బస్టర్ కొడితే అతని నెక్ట్స్ హీరో సినిమాకు మరింత ప్లస్ అవుతుంది. సో.. ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కాంబినేషన్ పై ఇప్పటి నుంచే అంచనాలు మొదలవుతున్నాయి.
నిజానికి సలార్ కంటే ముందే ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కాంబోలో సినిమా వస్తుందనుకున్నారు. మధ్యలో ఏమైందో కానీ ఈ ప్రాజెక్ట్ లేట్ అయింది. ఈ గ్యాప్ లో ప్రభాస్ ను ఒప్పించాడు ప్రశాంత్. అయినా ఎన్టీఆర్ తో రెగ్యులర్ గా టచ్ లోనే ఉన్నాడు. వీరి కాంబోలో మైత్రీ మూవీస్ బ్యానర్ లో సినిమా రాబోతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర పార్ట్ 1 చేస్తున్నాడు. తర్వాత వార్ 2 సినిమా షూటింగ్ పూర్తి చేస్తాడు. వార్ 2 సినిమా 2024 జూన్ లేదా జూలై వరకూ పూర్తయిపోతుందట. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. అటు ప్రశాంత్ కూడా కథ, కథనంపై మరింత కసరత్తు చేస్తాడు. సలార్ లో మాస్ కంటెంట్ ఎంత ఉన్నా స్టోరీ వీక్ అనేది నిజం. ఎన్టీఆర్ తో ఆ మిస్టేక్ కూడా వినిపించకుండా జాగ్రత్తలు తీసుకోబోతున్నాడట. సలార్ బ్లాక్ బస్టర్ కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో కూడా ఓ కొత్త జోష్ కనిపిస్తోంది. ఏదేమైనా వీరి కాంబోలో సినిమా కోసం తెలుగు జనాలు మాత్రం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే చెప్పాలి.