Salaar Collections : రెండో రోజూ సత్తా చాటిన సలార్
X
డార్లింగ్ స్టార్ ప్రభాస్ మానియా కంటిన్యూ అవుతూనే ఉంది. సలార్ ఈ యేడాది ఫస్ట్ డే హయ్యొస్ట్ గ్రాసర్ గా నిలిచి ఓ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ రికార్డ్ ను కంటిన్యూ చేస్తూ నెక్ట్స్ డే కూడా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేసింది. ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసిన ఖాన్సార్ వరల్డ్ కు ఫ్యాన్స్ తో పాటు జనరల్ ఆడియన్స్ కూడా ఫిదా అవుతున్నారు. కథ, కథనాల్లో పస లేకపోయినా తనదైన మాస్ ఎలివేషన్స్ తో మెస్మరైజ్ చేసే ప్రయత్నం చేశాడు ప్రశాంత్ నీల్. దీనికి తోడు ప్రభాస్ నుంచి ఈ రేంజ్ మాస్ మూవీ వచ్చి చాలా టైమ్ కావడంతో మరింత కనెక్ట్ అయ్యారు. అందుకే ఈ మూవీకి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. కాకపోతే ఫస్ట్ డే టాక్ చూసి రెండో రోజు కూడా అదే రేంజ్ కలెక్షన్స్ వస్తాయనుకున్న వారికి కాస్త నిరాశ కలిగింది. అయినా సలార్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది అనే చెప్పాలి.
సలార్ కు ప్రపంచ వ్యాప్తంగా రెండో రోజు 117 కోట్లు వసూళ్లు వచ్చాయి.ఓ రకంగా ఇది స్ట్రాంగ్ ఫిగర్ అనే చెప్పాలి. మొత్తంగా రెండు రోజులకు కలిపి 295.7 కోట్లు వచ్చాయి. ఈ వీకెండ్ తో పాటు క్రిస్మస్ హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి ఇండియాతో పాటు ఓవర్శీస్ లో కూడా ఇంకా వసూళ్లు సాధించే అవకాశాలున్నాయి. కాకపోతే కంటెంట్ పరంగా చూసుకుంటే వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. బట్ కలిసొచ్చిన హాలిడేస్ తో ఆ మ్యాజిక్ ఫిగర్ ను కూడా చేరుకుంటుంది అనుకోవచ్చు. ఇక ఈ ఆదివారం మరో వంద కోట్లు ఈజీగా వసూలవుతుందని అంచనా వేస్తోంది ట్రేడ్. మొత్తంగా ప్రభాస్ కటౌట్ ను మాత్రమే వాడుకుంటూ ప్రశాంత్ నీల్ రూపొందించిన సలార్ అంచనాలను అందుకునే దిశగానే దూసుకుపోతోందని చెప్పొచ్చు.