Home > సినిమా > ప్రభాస్ సలార్ ట్రైలర్ రిలీజ్

ప్రభాస్ సలార్ ట్రైలర్ రిలీజ్

X

ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సలార్ 1 ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ప్రశాంత్ నీల్ మార్క్తో 3 నిమిషాల 47 సెకన్ల నిడివితో ట్రైలర్ రిలీజ్ అయ్యింది. బద్ధ శత్రువులుగా మారే ఇద్దరు స్నేహితుల స్టోరీతో ఈ మూవీ తెరకెక్కుతోంది. హీరో ఎలివేషన్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌, విజువల్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇలా ప్రతీది ప్రశాంత్ మార్క్గా కన్పిస్తోంది. ట్రైలర్ 2.19 సెకన్ల తర్వాత ప్రభాస్ కన్పించడం గమనార్హం. ఇక ఈ మూవీ డిసెంబర్ 22న విడుదల కానుంది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విలన్గా చేస్తున్నాడు. టీనూ ఆనంద్‌, జగపతి బాబు, ఈశ్వరీరావు సహా పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Updated : 1 Dec 2023 7:38 PM IST
Tags:    
Next Story
Share it
Top