Home > సినిమా > Salaar Movie Trailer : సలార్ ట్రైలర్ డేట్ ఇదే

Salaar Movie Trailer : సలార్ ట్రైలర్ డేట్ ఇదే

Salaar Movie Trailer : సలార్ ట్రైలర్ డేట్ ఇదే
X

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా సలార్- పార్ట్1 సీజ్ ఫైర్. మోస్ట్ అవెయిటెడ్ ఇండియన్ మూవీగా చెప్పుకుంటోన్న సలార్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్, ప్రశాంత్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇద్దరు టాప్ ప్యాన్ ఇండియన్ స్టార్స్ కాంబోలో రూపొందిన సినిమా కావడంతో బిజినెస్ పరంగానూ భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను అందుకోవడం కోసం సలార్ డిసెంబర్ 22న విడుదల కాబోతోంది. అయితే ఈ మూవీకి సంబంధించి సరైన అప్డేట్స్ రావడం లేదని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా మేకర్స్ పట్టించుకోలేదు. ఇక అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా సలార్ ట్రైలర్ వస్తుందనుకున్నారు. బట్ మేకర్స్ ఏ అప్డేట్ ఇవ్వలేదు. ఫైనల్ గా సలార్ ట్రైలర్ కు టైమ్ వచ్చింది.





సలార్ ట్రైలర్ ను డిసెంబర్ 1న సాయంత్రం 7.19 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు మూవీ టీమ్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. గతంలో వచ్చిన టీజర్ ఏమంత ఆకట్టుకోలేదు. అందుకే ఈ ట్రైలర్ కోసం ఈగర్ గా చూస్తున్నారు జనం. ట్రైలర్ ను బట్టే సినిమా రేంజ్ ను అంచనా వేయొచ్చు. కాబట్టి బిజినెస్ వర్గాల్లో కూడా ఈ ట్రైలర్ పై ఆసక్తి ఉంది.

ప్రభాస్ తో పాటు మళయాల స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర చేస్తున్నాడు. అతను విలన్ గా నటిస్తున్నాడు అంటున్నారు. కానీ అది నిజమా కాదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. శృతి హాసన్ ఫీమేల్ లీడ్ లో కనిపించబోతోంది. తన పాత్ర రెగ్యులర్ హీరోయిన్ టైప్ లో ఉండదని ముందే చెప్పారు. ఇతర పాత్రల్లో జగపతి బాబు, టినూ ఆనంద్, శ్రీయా రెడ్డి, ఈశ్వరీ రావు నటిస్తున్నారు. హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తోన్న ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతం చేస్తున్నాడు.

Updated : 12 Nov 2023 11:03 AM IST
Tags:    
Next Story
Share it
Top