రిలీజ్కు ముందే రికార్డ్.. హాట్ కేకుల్లా అమ్ముడైన సలార్ టికెట్లు
X
ప్రభాస్ సినిమా వస్తుందంటేనే ఫ్యాన్స్ లో ఎక్కడలేని ఆసక్తి మొదలవుతుంది. ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తుంటారు. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా మారిన తర్వాత వచ్చిన మూడు సినిమాలు ఫెయిల్ అయ్యాయి. దాంతో ఆశలన్నీ ప్రస్తుతం పాన్ వరల్డ్ లెవల్ లో రిలీజ్ కాబోయే సలార్ సినిమాపై పెట్టుకున్నారు. జిఏఫ్ సిరీస్‌తో బాక్స్‌ఆఫీస్‌ను ఒక ఊపు ఊపిన ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సినిమా కావడం ,పైగా చాలా రోజుల గ్యాప్ తర్వాత ఫుల్ ప్యాకెడ్ పవర్ఫుల్ రోల్లో ప్రభాస్ కనిపించటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో సలార్ రిలీజ్ కాబోతుంది.
ఇదిలా ఉండగా తాజాగా యూఎస్ లో ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ చేశారు. దీంతో అక్కడ కూడా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. బుకింగ్స్ మొదలైన కొన్ని గంటల్లోనే అడ్వాన్స్ సేల్స్ తో రూ.87.07 లక్షలు కొల్లగొట్టింది. దీన్నిబట్టి చూస్తుంటే ఇండియాలో కూడా సినిమా రిలీజ్ కాకముందే ఎవ్వరూ ఊహించని కలెక్షన్స్ కొల్లగొట్టేలా కనిపిస్తోంది. యూఎస్ లో కూడా ఎప్పులేనంతగా ఎక్కువ థియేటర్లలో సినిమా రిలీజ్ చేస్తున్నారు. దీంతో అక్కడ కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురవడం పక్కా. వార్తలు బయటకు రానివ్వట్లేదు కానీ.. తెలుగు రాష్ట్రాల్లో లెక్కలకు మించి బిజినెస్ డీలింగ్స్ జరుగుతున్నాయని ప్రచారం. దీంతో బిజినెస్ లెక్కల ప్రకారం రూ.200 కోట్లు దాటే అవకాశం ఉంది.
Just IN:#Salaar CROSSES $100,000 [₹83.07 lacs] mark at the USA🇺🇸 Box Office from just advance sales.
— Manobala Vijayabalan (@ManobalaV) August 22, 2023
||#Prabhas|#SalaarCeaseFire|| pic.twitter.com/fU9ykMixiM