Home > సినిమా > మట్టికథ సల్లగుండు నాయన ర్యాప్ సాంగ్ రిలీజ్కు టైం ఫిక్స్..

మట్టికథ సల్లగుండు నాయన ర్యాప్ సాంగ్ రిలీజ్కు టైం ఫిక్స్..

మట్టికథ సల్లగుండు నాయన ర్యాప్ సాంగ్ రిలీజ్కు టైం ఫిక్స్..
X

తెలుగు వెండితెర రియాలిటీకి పట్టడం కడుతోంది. ఇంతవరకు సెల్యూలాయిడ్‌పై కనిపించని ముడిజీవితపు కథలను కొత్త దర్శకులు అద్భుతంగా పరిచయం చేస్తున్నారు. మైక్ మూవీస్ బ్యానర్‌పై వస్తున్న ‘మట్టికథ’ చిత్రం అటువంటిదే. విడుదల కాకముందే అంతర్జాతీయ అవార్డులను కొల్లగొట్టిన ఈ చిత్రం పల్లెటూరి కుర్రకారు ఆశనిరాశలను, ప్రేమలను, సరదాలను సరికొత్తగా కళ్లకు కడుతుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఓ సాంగ్ రిలీజ్ అవ్వగా.. ఇప్పుడు మరో సాంగ్ రిలీజ్కు సిద్ధమైంది.

ఈ సినిమాలోని ర్యాప్ సాంగ్ సల్లగుండు నాయన రేపు ఉదయం 11గంటలకు రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా తెలిపింది. ఈ పాటను ఫేమస్ ఫోక్ సింగర్ కనకవ్వ పాడింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. పవన్ కడియాల దర్శకత్వం వహించిన ఈ మూవీని మైక్ మూవీస్ బ్యానర్‌పై అన్నపరెడ్డి అప్పిరెడ్డి నిర్మించారు. సతీశ్ మంజీర సహనిర్మాత వ్యవహరిస్తున్నారు. అజయ్ వేడ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ప్రముఖ జానపద గాయని కనకవ్వ, ‘బలగం’ తాత సుధాకర్ రెడ్డి, దయానంద్ రెడ్డి తదితరులు నటించారు. స్మరణ్ సాయి సంగీతం అందించారు.

Updated : 9 Sept 2023 4:07 PM IST
Tags:    
Next Story
Share it
Top