ఈ దీపావళికి బాంబుల మోతే...టైగర్ వచ్చేస్తున్నాడు
X
పాన్ ఇండియా మార్కెట్‌ని కొల్లగొట్టేందుకు బడా స్టార్స్ రెడీ అయ్యారు. సెప్టెంబర్‌లో జవాన్‌తో దుమ్ము దులిపేందుకు బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ రెడీ కాగా , వరుసగా అక్టోబర్‌లో విజయ్ లియో, ఆ తర్వాత రవితేజ టైగర్ నాగేశ్వర రావు సినిమాలు క్యూ కట్టాయి. ఇక నవంబర్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు టైగర్ వచ్చేస్తున్నాడు. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీగా పేరు తెచ్చుకున్న టైగర్ 3 రిలీజ్ డేట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ రానే వచ్చేసింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా మేకర్స్ వదిలిన పోస్టర్ సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. రిలీజ్ డేట్‌తో విడుదలైన ఈ పోస్టర్ నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తోంది. జోయా, టైగర్ లు యాక్షన్ మోడ్ లో ఉన్నట్లు డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఓ రేంజ్ కిక్ ఇస్తుంది. ఈ దీపావళికి ఇక బాంబుల మోతే అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
ఈ దీపావళికి టైగర్ 3తో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు వచ్చేస్తున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. సల్లూ భాయ్ నటించిన ఏక్ థా టైగర్ , టైగర్ జిందా హై చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విషయం తెలిసిందే. ఇదే ప్రాంఛైజీలో వస్తున్న టైగర్ 3 త్వరలో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మనీశ్ శర్మ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీని యాష్ రాజ్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఈ ప్రాంఛైజీలో చేసిన రెండు సినిమాల్లోనూ సల్మాన్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కత్రినాకైఫ్ నటించింది.టైగర్ 3లోనూ మరోసారి సల్మాన్ తో జోడీ కట్టేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇదే క్రమంలోనే మరో సాలిడ్ అప్డేట్ ఇచ్చి మేకర్స్ ఫ్యాన్స్‌ను ఖుషి చేశారు.
టైగర్ 3 దీపావళి కానుకగా హిందీ, తెలుగు ,తమిళ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా మూవీ యూనిట్ ప్రకటించింది. అయితే విడుదల తేదీని మాత్రం అనౌన్స్ చేయలేదు. దేశభక్తి ప్రధాన ఇతివృత్తంతో వస్తున్న ఈ మూవీ ఆఖరి షెడ్యూల్ మినహా దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది. వచ్చే నెల నుంచి మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారు. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. అశుతోష్ రాణా, అనుప్రియా గోయెంకా, రిద్ధి డోగ్రా, అంగద్ బేడిలు కీలక పాత్రలు నటించనున్నారు.
Aa raha hoon! #Tiger3 on Diwali 2023. Celebrate #Tiger3 with #YRF50 only at a big screen near you. Releasing in Hindi, Tamil and Telugu. #KatrinaKaif | #ManeeshSharma | @yrf pic.twitter.com/3bMBWyPVGm
— Salman Khan (@BeingSalmanKhan) September 2, 2023