చైతన్యకు 'సారీ' చెప్పిన సామ్!
X
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య, సమంత, డివోర్స్ తీసుకుని అందరికీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. ప్రొఫెషనల్ లైఫ్‌లో స్టార్‌గా ఎదిగినా పర్సనల్ లైఫ్ లోకి వచ్చేసరికి సామ్ ఇంకా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూనే ఉంది. చైతూతో డివోర్స్ తీసుకున్నాక సామ్ పై నెగిటివ్ ట్రోల్స్ ఎక్కువయ్యాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో పుష్ప మూవీలో ఊ అంటావా మావా అనే ఐటెమ్ సాంగ్ చేసి బాలీవుడ్‌లో పాపులర్ అయింది. కానీ టాలీవుడ్‌లో మాత్రం ఆమెపై కొంత నెగిటివ్ ఒపీనియన్ అలానే ఉంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సామ్ ఎమోషనల్ అయ్యింది. 14 ఏళ్ల సినీ కెరీర్ పూర్తయినప్పటికీ తాను ఎన్నో కామెంట్స్ భరించలేకపోయానని చెప్పుకొచ్చింది. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ వల్ల ఇంకొన్ని విమర్శలు వచ్చాయని చెప్పింది. ఆ వెబ్‌సిరీస్‌లో రాజీ పాత్ర చేయడం వల్ల తన హోమ్ పాడైపోయిందని, అలా చేయడం వల్ల ఎవరైనా బాధపడితే క్షమించండి అంటూ సామ్ ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం సామ్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వెబ్ సిరీస్ వచ్చిన ఇన్ని రోజులకు సామ్ క్షమించమని అడగడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కచ్చితంగా సమంత తన మాజీ భర్త నాగ చైతన్యకే ఆ సారీ చెప్పిందని కామెంట్స్ చేస్తున్నారు.