Home > సినిమా > సామజవరగమన ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

సామజవరగమన ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

సామజవరగమన ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
X

రీసెంట్గా విడుదలై బంపర్ హిట్ కొట్టిన సినిమా సామజవరగమన. శ్రీవిష్ణు, నరేష్ తండ్రీకొడుకులుగా నటించిన ఈ మూవీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. సుమారు 7 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 50కోట్ల వరకు రాబట్టింది. మోస్ట్‌ ఎంటర్‌టైనింగ్‌ మూవీ ఆఫ్‌ ది ఇయర్‌గా నిలిచిన సామజవరగమన ఓటీటీ రిలీజ్‌కు ముహూర్తం ఖరారైంది. ఈ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఆహా సొంతం చేసుకుంది.





ఈ నెల 28 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా ప్రకటించింది. ‘‘నవ్వడం ఒక భోగం..నవ్వించడం ఒక యోగం. సామజవరగమన దానికి చక్కటి రూపం. ఇక నో ఆలస్యం..ఈ నెల 28 న ఆహాలో కలుద్దాం’’ ఆహా ట్వీట్ చేసింది. ఈ మూవీని రామ్‌ అబ్బరాజు డైరెక్ట్ చేయగా.. రెబా మోనికా హీరోయిన్‌గా నటించింది. జూన్ 29న ఈ సినిమా రిలీజైంది. వెన్నెల కిషోర్, రఘుబాబు, రాజీవ్ కనకాల,సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, దేవీ ప్రసాద్‌, ప్రియ కీలక పాత్రలు పోషించారు.




Updated : 21 July 2023 11:07 AM IST
Tags:    
Next Story
Share it
Top