రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన సమంత.. ఎందుకంటే..
X
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ని మర్యాదపూర్వకంగా కలిశారు. అందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత ప్రస్తుతం.. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి 'సిటాడెల్' అనే వెబ్ సిరీస్ చేస్తున్నది. 'ది ఫ్యామిలీ మెన్' వెబ్ సిరీస్ ని తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్ ని రూపొందిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ సెర్బియాలో జరుగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా 'సిటాడెల్' టీం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ని మర్యాదపూర్వకంగా కలిశారు. ద్రౌపతి ముర్ము ను సిటాడెల్ టీం సెర్బియాలోనే కలిసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫోటోలను వరుణ్ ధావన్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
'సిటాడెల్ టీం ఇండియా గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీ మతి ద్రౌపతి ముర్ము గారిని కలిసే అవకాశం దక్కడం ఎంతో ఆనందంగా ఉంది. సెర్బియాలో ద్రౌపతి ముర్ముజీ మేడం మిమ్మల్ని కలవడం ఎంతో గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం' అంటూ తెలిపారు.
సిడాటేల్ వెబ్ సిరీస్ విషయానికొస్తే.. ఇప్పటికే ఇంగ్లీషులో బాలీవుడ్ అగ్ర హీరోయిన్ ప్రియాంక చోప్రా ఈ వెబ్ సిరీస్ లో నటించింది. అయితే ఇంగ్లీష్ లో ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్ కి ఫ్రీక్వెల్ గా ఈ సిరీస్ ను రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ వెబ్ సిరీస్ లో ప్రియాంక చోప్రా తల్లిదండ్రులుగా వరుణ్ ధావన్, సమంత కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సిరీస్ కోసం సమంత చాలా కష్టపడుతోంది. ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్ లో యాక్షన్ సీక్వెన్స్ ల కోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటోంది.