Home > సినిమా > ప్రశాంతమైన ధ్యానంలో సమంత

ప్రశాంతమైన ధ్యానంలో సమంత

ఈషా ఫౌండేషన్లో సింపుల్ గా...కూల్ గా

ప్రశాంతమైన ధ్యానంలో సమంత
X


సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంత వ్యక్తిగతం జీవితం మీద దృష్టి పెట్టింది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికే ఈ బ్రేక్ అని చెప్పిన శామ్ బేబీ వెంటనే ఆ పనిలోకి దిగిపోయింది. ముందుగా తనకెంతో ఇష్టమైన ఇషా ఫౌండేషన్ కు వెళ్ళిపోయి ధ్యానంలో మునిగిపోయింది.

సమంత ప్రస్తుతం కొయంబత్తూర్ లో ఉంది. అక్కడి ఈషా షౌండేషన్ లో ప్రశాంతంగా గడుపుతోంది. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆమె ధ్యానం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో సమంత పోస్ట్ చేశారు. మెడిటేషన్, ఈషా ఫౌండేషన్ లోని ప్రకృతి అందాలను కూడా ఫోటోలు తీసి పెట్టింది.

https://www.instagram.com/p/Cu4KgZZLUUa/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==

ఇప్పటివరకు ఎలాంటి ఆలోచన లేకుండా, కదలకుండా కూర్చోవడం కష్టమనిపించింది. కానీ ప్రాక్టీస్ చేస్తే ధ్యానంలో ఉండే ప్రశాంతత, శక్తి అర్ధమైంది అని చెబుతోంది సమంత. స్పష్టతకు ధ్యానం అత్యంత శక్తివంతమైన మార్గమని తెలుసుకున్నాను అంటోంది. సమంత షేర్ చేసిన ఫోటోల్లో ఆమె చాలా ప్రశాంతంగా...సింపుల్ గా కనిపించింది. అందరితో పాటూ కలిసి కిందనే కూర్చుని ధ్యానం చేసింది సమంత. తను షేర్ చేసిన ఫోటోలకు ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. ఆమె అలా సింపుల్ గా కనిపించడం అందరికీ నచ్చేసింది.

సమంత ప్రస్తుతం బ్రేక్ లో ఉంది. ఒక ఏడాది పాటూ సినిమాలు చేయనని తీసుకున్న అడ్వాన్సులు కూడా తిరిగి ఇచ్చేసింది. నిర్మాతలు ఎంత వద్దని చెబుతున్నా...డబ్బులు ఇచ్చేసింది. సమంత నటించిన ఖుషి నటించిన సినిమా సెప్టెంబర్ 1 న విడుదల అవనుంది. అలాగే వరుణ్ ధావన్ తో నటించిన సిటాడెల్ ఇండియన్ వెర్షన్ కూడా త్వరలోనే విడుదల అవనుంది.


Updated : 20 July 2023 10:46 AM IST
Tags:    
Next Story
Share it
Top