Samantha on Insta: ‘నీతి, నిజాయితీతో ముందుకు సాగుతా’: సమంత
X
సమంత తన కెరీర్ లో చాలా మలుపులు చూసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అతనితో విడాకులు, ఆ వెంటనే మయోసైటిస్ వ్యాధి, ట్రోలింగ్స్ తో.. చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. వాటి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. ప్రస్తుతం ఖుషి సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు అమెరికాలో ఉన్న సమంత మయోసైటిస్ కు చికిత్స తీసుకుంటుంది. ఈ సందర్భంగా తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో సరదాగా గడిపింది. వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పింది.
తన జీవితానికి సంబంధించిన మూడు అంశాలను చెప్పుకొచ్చిన సమంత.. ‘నేను ఏదైనా సాధిస్తా. నా పరిస్థితులేంటి ఇలా ఉన్నాయని ప్రశ్నించడం మానేస్తా. జరుగుతున్న దాన్ని యథాతథంగా స్వీకరిస్తా. నీతి, నిజాయితీతో ముందుకు సాగుతా’ అంటూ చెప్పుకొచ్చింది. ‘చిన్న విషయాలకే నా జీవితం ఇలా అయిపోయిందేంటి అనుకోవద్దు. జీవితం ఇప్పుడే మొదలయింది. జీవిత ప్రయాణంలో ఎన్నో కష్టాలు, సవాళ్లు, సమస్యలు ఎదురవుతాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. అవే మనల్ని దృడంగా చేస్తాయి. నాకు 25 ఏళ్ల వయసున్నప్పుడు నేను ఇంత స్థాయికి ఎదుగుతానని అనుకోలేదు. వాటితో పాటు జీవితంలో ఇన్ని ఇబ్బందులు ఎదురవుతాయని ఊహించలేదు. ఏమైనా సానుకూలంగా ముందుకు సాగాలంటూ’ సమంత యువతకు సలహాలిచ్చింది.