Home > సినిమా > Samantha Ruth Prabhu : చైతన్యతో మళ్లీ కలవడంపై సమంత క్లారిటీ

Samantha Ruth Prabhu : చైతన్యతో మళ్లీ కలవడంపై సమంత క్లారిటీ

Samantha Ruth Prabhu : చైతన్యతో మళ్లీ కలవడంపై సమంత క్లారిటీ
X

ఒక చిన్న ఫోటో ఎన్నో అర్థాలు చెబుతుంది. మరెన్నో అనుమానాలను క్లియర్ చేస్తుంది. ప్రేమించి, పెళ్లి చేసుకుని కంట్రీలోనే మోస్ట్ బ్యూటీఫుల్ సెలబ్రిటీ అనిపించుకున్నారు నాగ చైతన్య, (Samantha Ruth Prabhu) సమంత. పెళ్లి తర్వాత చైతన్య .. శామ్ కు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు.సినిమాలు చేసింది. వెబ్ సిరీస్ లలో ఇంటిమేట్ సీన్స్ కూడా చేసింది. కొన్నాళ్లు బానే ఉన్న కాపురంలో కలతలు వచ్చాయి. కలిసి ఉండటం కుదరదు అనుకున్నారు. మధ్యవర్తులు కలిపి ఉంచేందుకు ప్రయత్నించారు. బట్ కుదర్లేదు. విడిపోయారు. అంతే. వీరి వైవాహిక జీవితం అనే కథ ఎప్పుడో ముగిసిపోయింది. కానీ వీళ్లు మళ్లీ కలవాలని కోరుకునేవాళ్లు.. ఇదుగో కలుస్తున్నారు.. అదుగో కలుస్తున్నారు అంటూ.. రకరకాల వార్తలు పుకార్లు పుకార్లుగా మొదలుపెట్టారు. ఆ వార్తలు ఇంకా వస్తూనే ఉన్నాయి కూడా. కానీ అది సాధ్యమా.. అంటే మినిమం సెన్స్ ఉన్న ఎవరికైనా కాదు అనే అర్థం అవుతుంది. ఇక ఈ తరహా గాలి వార్తలకు కూడా చీరకట్టు సోయగాలతో క్లారిటీ ఇచ్చింది సమంత.

గతేడాది మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన సమంత.. దాని నుంచి పూర్తిగా కోలుకునేందుకు ప్రస్తుతం చికిత్సతో పాటు పూర్తి స్థాయిలో విశ్రాంతి కూడా తీసుకుంటోంది. ఈ క్రమంలో అప్పుడప్పుడూ తన వెకేషన్ ఫోటోస్ ను ఫ్యాన్స్ తో సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటోంది. రీసెంట్ గా గులాబీ రంగు చీరకట్టులో ఒంపులు తిరిగిన దేహాన్ని చూపిస్తూ కొన్ని ఫోటోస్ షేర్ చేసుకుంది. ఇవి చూసి సమంత ఎంత అందంగా ఉందీ అనుకున్నారు చాలామంది. బట్ అసలు విషయం అది కాదు. అంతకు ముందు ఆమె కుడిచేయి కింద పక్కటెముకల వద్ద చే అంటూ ఓ పచ్చబొట్టు వేయించుకుంది. అది పచ్చబొట్ట కదా.. అందుకే వీళ్లు విడిపోయినంత సులువుగా, ఇన్స్టాగ్రామ్ లో ఫోటోస్ డిలీట్ చేసినంత ఈజీగా అది పోదు కదా..? అందుకే అది చెరిగిపోదు అనుకున్నారు చాలామంది. బట్.. ఆ పచ్చబొట్టును కూడా చెరిపేసుకున్నా అని చెప్పేందుకే ఈ ఫోటో పెట్టిందన్నమాట. సో.. చైతన్య తన జీవితం నుంచి శాశ్వతంగా వెళ్లిపోయినట్టే అని ఖచ్చితంగా చెప్పేసిందన్నమాట. దీంతో అతనికి సంబంధించిన అన్ని జ్ఞాపకాలను పూర్తిగా చెరిపేసుకున్నట్టుగానే అర్థం చేసుకోవచ్చు. అదీ మేటర్. ఇది చూసిన తర్వాతైనా... ఇంకా చైతన్య, సమంత కలుస్తున్నారా.. కలిశారా.. సీక్రెట్ ప్లేస్ లో మీట్ అయ్యారు అంటూ పిచ్చి రాతలు ఆపేస్తే మంచిది.


Updated : 11 Oct 2023 4:14 PM IST
Tags:    
Next Story
Share it
Top