Home > సినిమా > పుష్ప3లో సమంత..జాన్వీతో సాంగ్

పుష్ప3లో సమంత..జాన్వీతో సాంగ్

పుష్ప3లో సమంత..జాన్వీతో సాంగ్
X

టాలీవుడ్ ఇండస్ట్రీలో పుష్ప2 సినిమా కోసం సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 15న విడుదలయ్యే ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఆఖరి దశలో ఉంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. సమంత పుష్ప2లో ఐటెం సాంగ్ చేస్తుందని రూమర్స్ వైరల్ అయ్యాయి. అయితే ఇందులో సమంత ఓ కేమియో రోల్ చేస్తుందని తెలుస్తోంది. పుష్ప మూవీలో ఊ అంటావా మావ..ఊఊ అంటావా సాంగ్‌లో మెరిసిన ఈ బ్యూటీకి పుష్ప2, పుష్ప3లో ఓ స్పెషల్ క్యారెక్టర్ ఉందనే టాక్ వినిపిస్తోంది.

ముందుగా పుష్ప2లో సమంతను డైరెక్టర్ సుకుమార్ గెస్ట్ రోల్‌లో చూపించాలనుకున్నారట. చిన్న సాంగ్‌ బిట్‌లో అయినా సమంతను చూపెట్టాలనుకున్నారంట. అయితే పుష్ప2లో కొంతసేపు మాత్రమే చూపించి పుష్ప3లో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఇవ్వాలనుకున్నారట. ఇది వరకే హీరో అల్లు అర్జున్ కూడా పుష్ప3లో సమంత ఉంటుందని చెప్పారు. దీంతో ఈ క్రేజీ న్యూస్ విని తెలుగు ఆడియన్స్ తెగ ఆనందపడుతున్నారు.

మూడో భాగంలో సమంత పాత్రకు ఎక్కువ స్కోప్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. అలాగే పుష్ప2లో జాన్వీ కపూర్‌తో స్పెషల్ సాంగ్ చేయించారనే టాక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం సమంత కొత్త ప్రాజెక్టులకు ఓకే చెప్పడం లేదు. సోషల్ మీడియాలో మాత్రం తన ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంది. ఏమాయ చేశావే మూవీతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇండస్ట్రీకి వచ్చి 14 ఏళ్లు పూర్తి చేసుకుంది. గత ఏడాది విజయ్ దేవరకొండతో ఖుషీలో మెరిసింది. ఇప్పుడు సిటాడెల్ అనే టీవీ సిరీస్‌లో యాక్ట్ చేస్తోంది. ఈ సిరీస్ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


Updated : 25 March 2024 5:52 PM IST
Tags:    
Next Story
Share it
Top