Home > సినిమా > ఆ సమయం చాలా కష్టంగా గడిచింది.. విడాకులపై పరోక్షంగా నోరు విప్పిన సమంత

ఆ సమయం చాలా కష్టంగా గడిచింది.. విడాకులపై పరోక్షంగా నోరు విప్పిన సమంత

ఆ సమయం చాలా కష్టంగా గడిచింది.. విడాకులపై పరోక్షంగా నోరు విప్పిన సమంత
X

టాలీవుడ్ క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత, నాగచైతన్య జోడీ.. పెళ్లైన కొంత కాలానికి విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఎవరు పనుల్లో వారు బిజీగా ఉన్నారు. గత కొంతకాలంగా మయోసైటిస్ తో బాధపడుతున్న సమంత.. దాన్నుంచి కోలుకునేందుకు సినిమాలకు బ్రేక్ చెప్పింది. ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాలంన్నింటినీ పూర్తి చేసిన ఆమె.. తన ఆరోగ్యంపై దృష్టిపెట్టింది. విదేశాల్లో మయోసైటిస్ కు చికిత్స తీసుకుంటుంది. తన అనారోగ్య సమస్యలపై అందరికి అవగాహన కల్పించేందుకు ఒక పాడ్ కాస్ట్ కూడా సమంత మొదలుపెట్టింది. అందులో తన పర్సనల్ లైఫ్ విషయాల గురించి కూడా షేర్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే నాగ చైతన్యతో విడాకుల తీసుకున్నప్పుడు తన లైఫ్ లో జరిగిన ఘటనలపై పరోక్షంగా గుర్తు చేసుకుంది.

మయోసైటిస్‌ బారిన పడకముందు సరిగ్గా ఏడాది ముందు తనకు ఎంతో కష్టంగా గడిచిందని సమంత చెప్పుకొచ్చింది. ‘మయోసైటిస్‌ రావడానికి సరిగ్గా ఏడాది ముందు నాకు ఎంతో కష్టంగా గడిచింది. అది నాకు బాగా గుర్తుంది. విడాకులు తీసుకున్న తర్వాత.. నేను నా మేనేజర్‌ హిమాంక్‌తో కలిసి ముంబైలో వెళ్తున్నా. అప్పుడు నాకు చాలా ప్రశాంతంగా, రిలాక్స్‌డ్‌గా అనిపిస్తోందని అతనితో చెప్పా. ఇప్పుడిప్పుడే హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నా. తృప్తిగా నిద్రపోతున్నా. లేచి నా పనిపై దృష్టి పెడుతున్నానని అనిపించేలోపే.. మయోసైటిస్ నాపై దాడి చేసింద’ని సమంత చెప్పింది. మయోసైటిస్‌ రావడానికి సరిగ్గా ఏడాది ముందు సమంత.. చైతన్యతో విడాకులు ప్రకటించింది. ఆ టైంలో తను ఎదుర్కొన్న ఇబ్బందులను ఉద్దేశించి సామ్‌ ఇప్పుడు చెప్పింది.


Updated : 20 Feb 2024 6:25 PM IST
Tags:    
Next Story
Share it
Top