Home > సినిమా > Samantha: నాకు ఆ అనుభవమే బలాన్ని ఇస్తుంది.. అందుకే..

Samantha: నాకు ఆ అనుభవమే బలాన్ని ఇస్తుంది.. అందుకే..

Samantha: నాకు ఆ అనుభవమే బలాన్ని ఇస్తుంది.. అందుకే..
X

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సమంత దానికి ట్రీట్మెంట్ తీసుకుంటుంది. కాగా సమంత మయోసైటిస్ తో బాధపడే వాళ్లకోసం ఓ ముందడుగు వేసింది. తనలా ఈ వ్యాధితో బాధపడుతూ ప్రపంచానికి చెప్పుకోలేని వాళ్లకు సాయం చేసేందుకు సిద్ధం అయింది. ‘కొన్నాళ్ల క్రితం నాలో ఓ సందేహం మొదలయింది. నాలా చాలామంది మయోసైటిస్ తో బాధ పడుతుంటారు. వ్యాధి గురించి బయటికి చెప్పుకోలేక తమలో తాము కుమిలిపోతూ దాన్ని ఇంకా ఎక్కువ చేసుకుంటారు. సెలబ్రిటీ హోదాలో ఉన్నా నేను ధైర్యం చేసి అందరి ముందుకు వస్తే.. నాలా మరికొందరు ధైర్యం చేసి ఆ బాధను బయటికి చెప్పుకోగలుగుతారు. వాళ్లలో ఆ దిగులు కొంతైనా తీరుతుందం’టూ చెప్పుకొచ్చింది.

అందుకే మయోసైటిస్ ఇండియా వారితో చేతులు కలిపి.. ముందుకు నడుస్తోంది. మయోసైటిస్ పై అవగాహన కల్పించేందుకు, వ్యాధి వల్ల బాధ పడుతున్న వాళ్లలో ధైర్యం నింపేందుకు, పోరాడుతున్న వాళ్ల జీవితాల్లో తోడుగా ఉండేందుకు సమంత ముందుకు వచ్చింది. దాంతో సమంతను మయోసైటిస్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించారు. ఈ విషయాన్ని సమంత తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ఇక సమంత నిర్ణయాన్ని ప్రతీ ఒక్కరు అభినందిస్తున్నారు. ఒక సమస్యపై అవగాహన కల్పించేందుకు గొప్ప ముందడుగు అంటూ సమంతను పొగొడుతున్నారు.

సమంత, విజయ్ దేవరకొండ నటించిన ఖుషి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యే సినిమా కోసం ఈ ఇద్దరు ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో తమిళ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత ‘మంచైనా, చెడైనా పాజిటివ్ గా తీసుకునే బలాన్ని అనుభవమే ఇస్తుంది. ఈ విషయంలో నాకు ఎలాంటి గైడ్ లేదు. వచ్చే నెగెటివిటీ, పాజిటివిటీని చిరు నవ్వుతో ఎదుర్కుంటా’ అని చెప్పుకొచ్చింది.





Updated : 25 Aug 2023 8:46 PM IST
Tags:    
Next Story
Share it
Top