Home > సినిమా > ఫ్యాన్స్ చేసిన పనికి ఎమోషనల్ అయిన సమంత

ఫ్యాన్స్ చేసిన పనికి ఎమోషనల్ అయిన సమంత

ఫ్యాన్స్ చేసిన పనికి ఎమోషనల్ అయిన సమంత
X

టాలీవుడ్ స్టార్ హీరోయన్ సమంత మరోసారి వార్తల్లో నిలిచారు. ఏమాయ చేశావే మూవీతో తెలుగు తెరకు పరిచయమైన సామ్ కొన్నిరోజుల్లోనే స్టార్డమ్‌ను అందుకుంది. స్టార్ హీరోల సరసన నటిస్తూ మంచి ఫేమ్ సొంతం చేసుకుంది. కెరీర్ మంచి ఫాంలో ఉన్న టైంలో అనారోగ్య సమస్యలు, వ్యక్తిగత విషయాలు ఆమె జీవితాన్ని కుదిపేశాయి. ప్రేమ, పెళ్లి, విడాకుల వల్ల మానసికంగా సామ్ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత మయోసైటిస్ సమస్య వల్ల ఇంకాస్త చితికిపోయారు. చాలా కాలం మయోసైటిస్‌కు ట్రీట్మెంట్ తీసుకున్న సమంత ఈమధ్యనే కాస్త కోలుకున్నారు. కొన్నాళ్ల పాటు మూవీ ఈవెంట్లకూ దూరంగా ఉంటూ ఈ మధ్యనే యాక్టివ్ అయ్యారు. సిటాడెల్ ప్రమోషన్స్‌లో పాల్గొంటూ ఉన్నారు. అలాగే తన అభిమానుల కోసం సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ సందడి చేస్తుంటారు.

తాజాగా సామ్ తన అభిమానుల కోసం ఫ్యాన్స్ మీట్ పెట్టింది. తన అభిమానులను నేరుగా కలిసి వారితో చాలా సేపు ముచ్చటించింది. అందరితో ఫోటోస్ దిగి సందడి చేసింది. ఫ్యాన్స్ ఆమె కోసం బహుమతులు కూడా తీసుకొచ్చారు. వారితో కలిసి కేక్ కట్ చేసి కొన్ని విషయాలను పంచుకుంది. సమంతను చూసి కొందరు ఎమోషనల్ అయ్యారు. ఓ అమ్మాయి అయితే సామ్‌ను హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో సామ్ ఆ అభిమానిని ఓదార్చింది.

అభిమానుల ప్రేమను చూసి సామ్ సైతం ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఆ ఫోటోస్, వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఖుషి మూవీ తర్వాత సినిమాలకు బ్రేక్ తీసుకున్న సామ్..సిటాడెల్ సిరీస్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.


Updated : 25 March 2024 1:06 PM IST
Tags:    
Next Story
Share it
Top