Home > సినిమా > Samantha Saree : న్యూయార్క్ సిటీలో సమంత సదండి..చీరకట్టు ఫోటోలు వైరల్

Samantha Saree : న్యూయార్క్ సిటీలో సమంత సదండి..చీరకట్టు ఫోటోలు వైరల్

Samantha Saree : న్యూయార్క్ సిటీలో సమంత సదండి..చీరకట్టు ఫోటోలు వైరల్
X


చీరలు మ‌గువ‌ల అందాల‌ను రెట్టింపు చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మోడ్ర‌న్ డ్రెస్సుల్లో క‌నిపించ‌ని ఆకర్షణ చీర‌క‌ట్టులో ఉంటుంది. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలు చీర‌లో దర్శనమివ్వడం చాలా అరుదే. సిల్వర్ స్క్రీన్‎పైన పొట్టి పొట్టి డ్రెస్సుల‌తో గ్లామ‌ర్‎ను ఒలకబోసే కథానాయికలు అప్పుడప్పుడు చీర‌క‌ట్టులో మెరిసి ఫ్యాన్స్ గుండెల్లో గుబులు రేపుతుంటారు. తాజాగా సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత చీర‌క‌ట్టులో ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‎లో పోస్ట్ చేసి ఫుల్ ఖుషీ చేసుకుంటోంది. తన అభిమానులను మంత్రముగ్ధులను చేస్తోంది.

సమంత ప్రస్తుతం న్యూయార్క్ సిటీలో సందడి చేస్తోన్న సంగతి తెలిసిందే. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఇండియన్స్ ఇండిపెండెన్స్ పరేడ్ కోసం సమంత న్యూయార్క్ వెళ్లింది. గత రెండు మూడు రోజులుగా సామ్ న్యూయార్క్ వీధుల్లో షికారు చేస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‎ను ఇంప్రెస్ చేస్తోంది. న్యూయార్క్‎లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర దిగిన పిక్ , జిమ్ వర్కౌట్స్ చేస్తున్న ఫొటోలు, ఫ్రెండ్స్‎తో లంచ్ చేస్తున్న చిత్రాలతో పాటు న్యూయార్క్ వీధులు అక్కడ నగరపు అందాలను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అందరికీ పరిచయం చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ నలుపు రంగు చీర కట్టుకుని ఎంతో క్యూట్ గా కనిపించింది. అమెరికాకే కొత్త అందాలను అద్దింది. ఈ చీరకట్టులో అదిరిపోయే ఫోజులతో ఫోటోలు దిగి వాటిని ఇన్‌స్టాగ్రామ్‎లో పోస్ట్ చేసింది.ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

మయోసైటిస్ సమస్య పూర్తిగా తగ్గేవరకు హెల్త్ మీద బాగా ఫోకస్ చేయాలని ఈ మధ్యనే సామ్ బాగా ఫిక్స్ అయ్యింది. అందుకే ఖుషీ, సీటాడెల్ షూట్స్‎ను శరవేగంగా పూర్తి చేసింది. ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో సామ్ అమెరికాలో ప్రత్యక్షం కావడంతో ఆమె ట్రీట్మెంట్ కోసమే అక్కడికి వెళ్లారన్న వార్తలు ఇప్పుడు నెట్టింట్లో చెక్కర్లు కొడుతున్నాయి.

సమంత తాజాగా నటించిన ఖుషీ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఈ మధ్యనే ఖుషీ మ్యూజికల్ కన్సర్ట్ లో హీరో విజయ్ దేవరకొండతో ఆడిపాడి సందడి చేసింది సమంత. అయితే సినిమా రిలీజ్ వరకు ఆగకుండా సమంత తల్లితో కలిసి అమెరికా చెక్కేసింది. ఇంతకాలం ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలను సందర్శించి సేదదీరిన సామ్ ఇప్పుడు న్యూయార్క్ లో చక్కర్లు కొడుతుంది. అక్కడ తన అందాలతో రచ్చ రచ్చ చేస్తోంది.




Updated : 22 Aug 2023 1:38 PM IST
Tags:    
Next Story
Share it
Top