Home > సినిమా > Samantha : మాజీ ప్రియుడితో సమంత సినిమా? క్రేజీ న్యూస్ వైరల్

Samantha : మాజీ ప్రియుడితో సమంత సినిమా? క్రేజీ న్యూస్ వైరల్

Samantha : మాజీ ప్రియుడితో సమంత సినిమా? క్రేజీ న్యూస్ వైరల్
X

సినీ ఇండస్ట్రీలోకి ఏమాయ చేశావే అంటూ సమంత ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీలో అక్కినేని నాగచైతన్యతో జతకట్టి జెస్సీ పాత్రలో ఒదిగిపోయింది. ముఖ్యంగా యువతను సామ్ తనవైపు తిప్పుకుంది. ఆ తర్వాత చాలా సినిమాలు ఆమెకు తిరుగులేని క్రేజ్‌ను తీసుకొచ్చాయి. తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సమంత 14 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు సమంత ఏం చెప్పినా, సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా తెగ వైరల్ అయిపోతోంది. సమంత అనగానే అందరికీ రెండు విషయాలు గుర్తుకొస్తాయి. అందులో నాగచైతన్యతో విడాకులు, మరొకటి మయోసైటిస్. ఈ మధ్యనే ఈ అమ్మడు మయోసైటిస్‌కు చికిత్స కూడా తీసుకుంది. ప్రస్తుతం సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకుంటోంది.

నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత సమంత ఎంత పాపులర్ అయ్యిందో.. విడాకులు తీసుకున్న తర్వాత కూడా అంతకంటే ఎక్కువ పాపులర్ అయ్యింది. ఏడాది నుంచి ఆమె సినిమాలకు దూరంగా ఉంటోంది. ఈ మధ్యనే ఓ ప్రొడక్షన్ హౌస్‌ను కూడా ప్రారంభించింది. ఇప్పుడిప్పుడే కొత్త కథలను వింటూ బిజీ అవుతోంది. ఇకపోతే సమంత తన పాత బాయ్‌ఫ్రెండ్‌తో మూవీ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. పాత బాయ్‌ఫ్రెండ్ అనేదానికన్నా పాత లవర్ అనొచ్చు. నాగచైతన్యతో వివాహం కాకముందు సమంత హీరో సిద్దార్థ్‌తో ప్రేమలో పడింది. ఆ ఇద్దరూ ఎంతో సన్నిహితంగా ఉండేవారు. అయితే ఇద్దరి మధ్యా అభిప్రాయ భేదాలు రావడంతో దూరమయ్యారు.

సిద్ధార్థ్‌తో బ్రేకప్ అయిన తర్వాత నాగచైతన్యతో ఉండే ఫ్రెండ్షిప్ కాస్తా ప్రేమగా మారింది. ఇక సమంతకు చైతుతో పెళ్లి కూడా అయ్యింది. ఆ విషయం అందిరికీ తెలిసిందే. సమంత పెళ్లి తర్వాత సిద్ధార్థ్ కూడా వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అయితే చాలా రోజుల తర్వాత ఆ జంట మళ్లీ కలవబోతోంది. సమంత ఇప్పుడు సిద్ధార్థ్‌తో కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లుగా సోషల్ మీడియాలో పలు కథనాలు వెలువడుతున్నాయి. ఈ మధ్య జరిగిన ఓ ఇంటర్వ్యూలో సిద్ధార్థ్ ఈ విషయాన్ని చెప్పకనే చెప్పాడు. సమంత గురించి ఆ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మిస్ బ్యూటిఫుల్ ఎవరని హీరో సిద్ధార్థ్‌ని అడిగితే అందుకు వెంటనే ఆయన సమంత అని చెప్పాడు. ఆ తర్వాత మిస్ పర్ఫెక్ట్ ఎవరని యాంకర్ అడిగిన మరో ప్రశ్నకు కూడా సమంత అనే చెప్పాడు. దీంతో సమంతను సిద్దార్థ ఇంకా మర్చిపోవడం లేదని తెలుస్తోంది. త్వరలోనే వీరిద్దరూ కలవబోతున్నారంటూ పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో నిజం ఉందో లేదో తెలియాలంటే మరికొంత కాలం ఎదురుచూడాల్సిందే. సమంత అభిమానులు మాత్రం సిద్ధార్థ్‌తో అస్సలు సినిమా చేయదని చెప్పేస్తున్నారు. ఇంకొందరేమో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చని కామెంట్స్ చేస్తున్నారు.





అప్పట్లో సమంత, సిద్ధార్థ్ శ్రీకాళహస్తి ఆలయంలో రాహు-కేతు పూజలు చేశారు. దీంతో వారిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని అందరూ అనుకున్నారు. కానీ విభేదాలు వచ్చి విడిపోయారనే టాక్ నడిచింది. సమంత పెళ్లికి కూడా సిద్ధార్థ్ విషెష్ చెప్పలేదు. సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నప్పుడు సిద్ధార్థ్ నుంచి ఎటువంటి స్పందనా లేదు. అయితే ఇప్పుడు మాత్రం సమంత పేరును సిద్ధార్థ్ జపం చేయడం పట్ల సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. సమంతకు సిద్ధార్థ్ మళ్లీ దగ్గరవ్వాలని చూస్తున్నాడా? అంటూ కొందరు అంటుంటే మరికొందరేమో పక్కాగా సినిమా స్టంటే అని అంటున్నారు. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే ఇంకొంత కాలం ఎదురుచూడాల్సిందే.


Updated : 12 March 2024 2:40 PM GMT
Tags:    
Next Story
Share it
Top