Home > సినిమా > షార్ట్ హెయిర్ లో హొయలుపోతున్న సామ్ బేబీ

షార్ట్ హెయిర్ లో హొయలుపోతున్న సామ్ బేబీ

క్యూట్ నవ్వుతో కట్టిపడేస్తోంది

షార్ట్ హెయిర్ లో హొయలుపోతున్న సామ్ బేబీ
X


కొత్త లుక్ తో సమంత అందరినీ కట్టిపడేస్తోంది. సినిమాల నుంచి కొంతకాలం దూరంగా ఉంటానని చెప్పిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటోంది. తాజాగా షార్ట్ హెయిర్ తో బీచ్ లో ఉన్న ఓ చిన్న వీడియోను తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది.

ప్రస్తుతం విదేశాలకు వెళ్ళేందుకు సిద్ధమవుతోంది సమంత. ఇటీవలే ఖుషి, సిటాడెల్ చిత్రీకరణలు పూర్తిచేసిన ఆమె...గత కొన్నిరోజులు కోయంబత్తూరులోని సద్గురు ఇషా ఫౌండేషన్‏లో గడిపింది. ఇప్పుడు విదేశాలకు పయనమవుతున్నట్లు తెలుస్తోంది. తన ఆరోగ్యం విషయంగానే సినిమాల నుంచి గ్యాప్ తీసుకుంటున్నాని చెప్పిన సామ్ మయోసైటిస్ సమస్యకు చికిత్స తీసుకోవడానికే అక్కడకు వెళ్ళనుంది. అందుకే ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసుకుంది.. కొత్త సినిమాలకు తీసుకున్న అమౌంట్ ను కూడా తిరిగి వెనక్కి ఇచ్చేసింది. వెళ్ళే ముందు ఫ్యాన్స్ కు కనువిందు చేయాలనుకుందో ఏమో...ఓ సూపర్ వీడియో పెట్టి ట్రీట్ చేసింది. ఇందులో షార్ట్ హెయిర్ తో చాలా క్యూట్ గా కనిపించింది సామ్ బేబి. నీళ్ళ ఒడ్డున చిలిపినవ్వుతో కట్టిపడేసింది.

https://www.instagram.com/reel/CvCuWJmgsuC/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==

సామ్ ప్రెట్టీ లుక్ కి ఆమె ఫ్యాన్స్ ఫిధా అయిపోతున్నారు. ఎంతో అందంగా ఉన్నావు...ఎప్పుడూ ఇలాగే ఉండు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు సామ్ న్యూలుక్ పై హీరోయిన్ హన్సిక స్పందిస్తూ.. సమంత ఎప్పటికీ అందంగా ఉంటుందంటూ కామెంట్ చేసింది. ఇక సమంత విజయ్ దేవరకొండ జంటగా నటించిన లేటేస్ట్ చిత్రం ఖుషి. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది.


Updated : 24 July 2023 10:26 AM IST
Tags:    
Next Story
Share it
Top